Begin typing your search above and press return to search.
ఈ వయసులో ఆ సినిమాలు చేయలేను
By: Tupaki Desk | 24 Jan 2022 5:31 AM GMTనాగార్జున 'బంగార్రాజు' సినిమా తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. నాగ చైతన్యతో కలిసి నటించినా కూడా నాగార్జున ఎక్కడ కూడా తగ్గకుండా కొడుకును మించినట్లుగా నటించేలా యాక్టివ్ గా కనిపించాడు అంటూ రివ్యూలు వచ్చాయి.
నాగార్జున ఆరు పదుల వయసు దాటినా కూడా ఇంకా నాలుగు పదుల వయసు అన్నట్లుగా కూడా లేడు అంటూ అభిమానులు ముఖ్యంగా మహిళ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సమయంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో తన వయసు గురించి ఆసక్తికర వ్యాక్యలు చేశాడు.
ఎప్పుడు కూడా నాకు వయసు మీద పడిందంటే నేను ఒప్పుకోను అన్నట్లుగా వ్యాఖ్యలు చేసే నాగార్జున ఈసారి మాత్రం వయసుకు తగ్గట్లుగా సినిమాలు చేస్తానంటూ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది.
ఈమద్య కాలంలో స్పోర్ట్స్ డ్రామా లు చాలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. నాగార్జున కూడా ఒక సినిమా ఆ తరహాలో చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు భావించారు. కాని అనూహ్యంగా నాగార్జున ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు..
ముందు ముందు చేస్తాడనే నమ్మకం కూడా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో పోయింది. హీరోగా ముందు ముందు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాని స్పోర్ట్స్ డ్రామా కథతో నాగార్జున సినిమా చేసేందుకు ఆసక్తిగా లేడని తేలిపోయింది. ఆయన స్వయంగా ఈ వయసు లో నేను అలాంటి సినిమాలు చేయలేను అంటూ తేల్చి చెప్పాడు.
స్పోర్ట్స్ కథ లు అంటే ఫిజిక్ మాత్రమే కాకుండా ఫిజికల్ గా కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే నాగార్జున ఈ వయసులో ఆ సినిమాను వద్దు అనుకోవడం మంచిదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ థర్డ్ వేవ్ పూర్తి అయిన తర్వాత నాగార్జున 'ది ఘోస్ట్' సినిమా ను పునః ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. బంగార్రాజు కంటే ముందుగానే ఘోస్ట్ ను విడుదల చేయాలనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల బంగార్రాజు ఆలస్యం అయ్యింది.. ది ఘోస్ట్ సినిమా ను ఇదే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.