Begin typing your search above and press return to search.
అమ్మాయితో సరసం భార్యకుదొరికిపోయినహీరో
By: Tupaki Desk | 26 Jan 2016 3:30 PM GMTసినీ పరిశ్రమలో అక్రమ సంబంధాలకు కొదవేమీ ఉండదు. హీరోలు పెళ్లయ్యాక కూడా హీరోయిన్లతో ఎఫైర్లు నడపడం కొత్తేమీ కాదు. బాలీవుడ్ లో ఈ సంస్కృతి ఎప్పట్నుంచో ఉంది. హీరోయిన్లతో సరసమాడుతూ భార్యలకు దొరికిపోయిన కొందరు హీరోల ఉదంతాలు గతంలో బయటికి వచ్చాయి. ఐతే ఓ హీరో స్వయంగా తాను ఓ అమ్మాయితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సంగతిని మీడియా ముందు ధైర్యంగా వెల్లడించిన ఉదంతం మాత్రం ఇదే తొలిసారి అయి ఉంటుంది. సీనియర్ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా ఈ సంచలనానికి తెర తీశాడు. 'ఎనీథింగ్ బట్ ఖామోష్' పేరుతో రాసిన తన ఆటో బయోగ్రఫీ విడుదల సందర్భంగా శత్రుఘ్న సిన్హా ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో చాలా ఏళ్ల కిందట సంగతిని ఆయన వెల్లడించారు.
‘‘నాకు పూనంతో పెళ్లయ్యాక కూడా ఓ హీరోయిన్ తో బంధం కొనసాగించాను. ఐతే ఆ హీరోయిన్ తో ఉండగా రెడ్ హ్యాండెడ్ అంటారే.. అలా ఓ సారి నా భార్యకు దొరికిపోయాను. కానీ క్షమాపణలు చెప్పుకున్నతర్వాత మా మధ్య మళ్లీ మనస్పర్థలు రాలేదు’’ అని తన ఎఫైర్ గురించి బోల్డ్ గా చెప్పేశారు శత్రుఘ్న సిన్హా. అప్పట్లో తనకు అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదని.. 'ఎవర్ని పెళ్లి చేసుకోవాలి? అనేది ప్రశ్నేకాదు. ఎవర్ని చేసుకోకుండా ఉండాలి? అనే ఆలోచించేవాణ్నని చెప్పారు సిన్హా. ఇక రాజకీయాల ప్రస్తావన తెస్తూ.. ఎంపీలై ఉండి రాజ్య సభకు రాని సచిన్, రేఖలపై మండిపడ్డాడు సిన్హా. ‘‘నా దృష్టిలో సచిన్, రేఖ లాంటివాళ్లు టైంపాస్ ఎంపీలు. వీళ్లు చర్చల్లో పాల్గొనరు. అసలు సభకే రారు. నేనే కనుక ఎంపీల్ని ఎంపిక చేయాల్సి వచ్చి ఉంటే.. ఇలాంటి వాళ్లకు అస్సలు అవకాశం ఇవ్వను. ప్రముఖులకు చోటు కల్పిస్తే రాజ్యసభ గౌరవం పెరుగుతుందని భావిస్తాం కానీ.. అలా ఎన్నటికీ జరగదు’’ అని కుండబద్దలు కొట్టారు సిన్హా. అసహనంపై బాలీవుడ్ సెలబ్రెటీలు చేసిన వ్యాఖ్యల్ని చైల్డిష్ కామెంట్స్ గా అభివర్ణించారాయన.