Begin typing your search above and press return to search.

గ్లిజరీన్ లేకుండానే ఏడ్చాను: చిరంజీవి

By:  Tupaki Desk   |   14 Jan 2023 4:35 PM GMT
గ్లిజరీన్ లేకుండానే ఏడ్చాను: చిరంజీవి
X
రవితేజ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీగా వాల్తేర్ వీరయ్య ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు వింటేజ్ చిరంజీవిని చూసే అవకాశం వచ్చిందనే మాట ఆడియన్స్ నుంచి వినిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ కథ అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకుడు బాబీ అద్భుతమైన కథనంగా ఆవిష్కరించారు.

చిరంజీవి, రవితేజ ఈ మూవీలో అన్నదమ్ములుగా నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సెకండాఫ్ ఆరంభంలో రవితేజ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. క్లైమాక్స్ ముందు చనిపోతుంది. అయితే వీరిద్దరి మధ్య వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగుతుంది. రవితేజ చనిపోయే సమయంలో అన్నయ్య వీరయ్యతో జరిగే సంభాషణ ప్రేక్షకులని భాగా కనెక్ట్ అయ్యింది.

ఈ సన్నివేశం గురించి తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో చిరంజీవి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ఈ సీన్ లో తాను ఎలాంటి గ్లిజరీన్ వాడకుండానే కన్నీళ్లు పెట్టుకున్నా అని చిరంజీవి చెప్పారు. ఆ ఎమోషనల్ సీన్ చేసే సమయంలో నిజానికి రవితేజ కాకుండా ఇంకెవరైనా ఉంటే ఆ స్థాయిలో చేయలేకపోయేవాడినేమో అని రవితేజ చెప్పారు. రవితేజని కేవలం తన తమ్ముడుగా భావించడం వలన ఆ ఎమోషనల్ సీన్ లో గ్లిజరీన్ లేకుండా చేయగలిగానని, అలాగే అద్బుతంగా స్క్రీన్ పై ప్రేక్షకులని కంటతడి పెట్టించే విధంగా వచ్చిందని స్టేజ్ పై చిరంజీవి రవితేజని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇవి వైరల్ గా మారాయి. అలాగే మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే అన్ని సీన్స్ కూడా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా ఉన్నాయని చిరంజీవి అన్నారు. రవితేజ అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోసాడని చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ సక్సెస్ మీట్ లో రవితేజ మాట్లాడుతూ సినిమాని థీయాట్రికల్ అనుభూతి కోసం థియేటర్ కి వెళ్లి చూశానని, చూసిన తర్వాత, అలాగే ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత తన అభిప్రాయం తప్పుకాలేదని అర్ధమైందని అన్నారు. ముందుగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేసినట్లే జరిగిందని రవితేజ చెప్పారు. మరోసారి అన్నయ్య చిరంజీవితో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అని రవితేజ తెలిపారు. రవితేజ కోరిక కచ్చితంగా నెరవేరుతుందని, మరోసారి ఇద్దరం కలిసి నటించే కాన్సెప్ట్ కోసం తాను చూస్తున్నా అని చిరంజీవి చెప్పారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.