Begin typing your search above and press return to search.
నేను అలాంటి వాడిని కాదు.. అలా చేయను
By: Tupaki Desk | 12 Feb 2019 1:01 PM GMTకోలీవుడ్ లో పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన నటుడు, హీరో విజయ్ సేతుపతి. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తనదైన శైలిలో నటిస్తూ అవార్డులు రివార్డులు అందుకోవడంతో పాటు సినిమా సినిమాకు అభిమానులను విపరీతంగా పెంచుకుంటూ పోతున్న విజయ్ సేతుపతి తాజాగా ఒక వివాదంలో తన ప్రమేయం లేకుండా చిక్కుకున్నాడు. కొందరు ఆకతాయిలు చేసిన పనితో విజయ్ సేతుపతిపై విమర్శలు వెలువెత్తాయి.
విజయ్ సేతుపతి హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను అవమానించినట్లుగా ట్వీట్ చేశాడు అంటూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. భగవద్గీత అనేది ఒక ఆధ్యాత్మిక పుస్తకం కాదు, అందులో ఉన్న అంశాలన్నీ కూడా కల్పితాలే, ఆ కల్పితాల వల్లే ప్రస్తుత సమాజం దిగజారుతోంది అంటూ అందులో ఉంది. ఆ ట్వీట్ నిజంగా విజయ్ సేతుపతి చేసి ఉంటాడని భావించిన కొందరు విజయ్ సేతుపతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు. తనపై వస్తున్న విమర్శలకు విజయ్ సేతుపతి స్పందించాడు. అది నిజమైనది కాదని, కొందరు కావాలని ఎడిట్ చేశారు అంటూ చెప్పుకొచ్చాడు.
అసలు విషయం ఏంటీ అంటే ఇటీవల తమిళనాడు పోలీసులు మొబైల్ చోరీలను అరికట్టేందుకు కొత్త విధానం తీసుకు వచ్చారు. ఆ విధానంను అభినందిస్తూ విజయ్ సేతుపతి ట్వీట్ చేశాడు. ఆ విషయం ఒక ఛానెల్ లో బ్రేకింగ్ న్యూస్ గా వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ అంటూ ఉన్న స్థానంలో ఎడిట్ చేసి విజయ్ కి వ్యతిరేకంగా పోస్ట్ చేశారు. దాంతో విజయ్ విమర్శలు ఎదుర్కొన్నాడు.
తనపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. నేను ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక పుస్తకాలను కించపర్చేలా మాట్లాడను, నేను అలాంటి వాడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఈయన ప్రస్తుతం తెలుగులో 'సైరా' చిత్రంలో నటిస్తున్నాడు. సైరాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ సేతుపతి గత ఏడాది '96' చిత్రంతో బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.