Begin typing your search above and press return to search.
అలా అయితే మన సినిమా చూసే తీరిక ఎక్కడుంటుంది పూరీ!
By: Tupaki Desk | 16 July 2019 5:52 AM GMTఏ రంగంలో ఉన్న వారు ఆ రంగానికి సంబంధించిన విషయాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్డేట్ అవుతుంటారు. ఎవరి వరకో ఎందుకు.. జర్నలిస్టు అనే వాడు నేను పేపర్ చదవను.. టీవీ చూడనంటే అప్డేట్ కావటం సాధ్యం కాకపోవచ్చు. ఎంత బిజీగా ఉన్నా.. కనీసం రెండు.. మూడు పేపర్లను చదవటమో కాదూ కూడదంటే కనీసం చూడటమైనా చేయాలి. లేకుంటే చాలా త్వరగా బండి గ్యారేజీకి వెళ్లటం ఖాయం.
జర్నలిస్టులకు పేపర్లు.. టీవీలో న్యూస్ చదవటం ఎంత ముఖ్యమో.. సినిమా రంగానికి చెందిన వారు.. తరచూ భాషలతో సంబంధం లేకుండా మంచి సినిమాల్ని తప్పకుండా చూస్తారు. ఇక.. వైవిధ్యంగా సినిమా ఉందన్న టాక్ విన్నంతనే దాన్ని చూసేందుకు వాలిపోతారు. అలాంటిది దర్శకుడు పూరీ మాత్రం ఇటీవల కాలంలో సినిమాలు చూసే తీరకే ఉండటం లేదని చెబుతున్నారు.
అగ్రనటుల సినిమాలు కాదు కానీ.. రోటీన్ కు భిన్నంగా ఉండే జానర్ లో సినిమాలు రావటం ఈ మధ్యన ఎక్కువైంది. ఆ కోవలోకే జెర్సీ.. మజిలీ.. బ్రోచేవారెవరురా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. ఫలక్ నామా దాసూ.. బేబీ.. లాంటివి చెప్పొచ్చు. ఈ సినిమాలన్ని బాగానే ఆడాయి కూడా. తెలుగు సినిమా రోటీన్ చట్రం నుంచి బయటపడేలా చేస్తున్న ప్రయత్నాలకు ఈ సినిమాల్ని ఎగ్జాంఫుల్ గా చూపించొచ్చు.
కానీ.. ఈ సినిమాలేవీ చూడలేదంటున్నారు పూరీ. మిగిలినోళ్ల సినిమాలు చూసేందుకు పూరీకి టైం లేనప్పుడు.. పూరీ సినిమాను చూసే టైం కూడా జనాలకు ఉండేదమో? పూరీ మాదిరి అందరూ అనుకుంటే.. ఆయన తాజా చిత్రం మాటేమిటి? కొత్త ప్రయత్నం చేయటమే చాలా తక్కువ. అలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు సీనియర్ దర్శకుడిగా వారిని ప్రోత్సహించటం అవసరం. కానీ.. నేను.. నా టైం అన్నట్లుగా ఉండే మాటలు మిగిలిన వారిని ఎంతలా హర్ట్ చేస్తాయన్న చిన్న విషయాన్ని పూరీ ఎందుకు మిస్ అవుతుంటారు?