Begin typing your search above and press return to search.
దంగల్ బ్యూటీకీ తప్పని ఆ చేదు అనుభవం
By: Tupaki Desk | 13 March 2019 11:52 AM GMTఅన్ని భాషల సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే అమ్మాయిలపై లైంగిక వేదింపులు జరిగాయని, ఎంతో మంది అమ్మాయిల జీవితాలను కొందరు నాశనం చేశారని మీటూ ఉద్యమం సమయంలో తేలిపోయింది. కొత్తగా అవకాశాల కోసం ఇండస్ట్రీకి వచ్చింది అంటే ఆమెను ఏదోలా వాడేసుకోవాలని కొందరు ప్రయత్నించడం జరిగిందని ఎంతో మంది ఆరోపించారు. కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కాలంగా ఉందని అంతా మొత్తుకుంటున్నా అడి నడుస్తూనే వచ్చింది. అయితే ఎప్పుడైతే మీటూ ఉద్యమం మొదలైందో అప్పుడు కాస్టింగ్ కౌచ్ తగ్గిపోయింది. గతంలో తాము పడ్డ ఇబ్బందులను సెలబ్రెటీలు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఇప్పుడు దంగల్ బ్యూటీ ఫాతీమా సనా షేక్ వంతు వచ్చింది.
మీటూ ఉద్యమం ఉదృతంగా ఉన్న సమయంలో ఈమె మౌనం వహించింది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను లైంగిక వేదింపులు ఎదుర్కొన్నాను. అవకాశాల కోసం ప్రయత్నించిన సమయంలో బెడ్ రూంకు రమ్మని చాలా మంది పిలిచారు. పక్కలోకి వస్తే పక్కా వేశం అన్నారు. కాని వాటిని నేను చాలా జాగ్రత్తగా దాటుకుంటూ అవకాశాలు దక్కించుకున్నాను. నన్ను లైంగికంగా వేదించిన వారి పేర్లను నేను బయటకు చెప్పను, అయితే వారిని అలాగే వదిలి పెడతానని మాత్రం అనుకోవద్దు. వారికి సమయం వచ్చినప్పుడు సరైన బుద్ది చెప్తాను అంది.
గతంలో ఇండస్ట్రీలో చాలా మంది నీచులు ఉండేవారు. అయితే ఎప్పుడైతే మీటూ ఉద్యమం మొదలైందో అప్పటి నుండి కూడా అంతా భయపడుతున్నారు. అలాంటి వారు అంతా కూడా తమ పేరు ఎక్కడ బయట పడి రోడ్డున పడాల్సి వస్తుందో అనే భయంతో సైలెంట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళలకు గౌరవం దక్కుతుంది. గతంతో పోల్చితే ప్రస్తుత పరిస్థితి చాలా ఉత్తమం. ఇకపై కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఫాతీమా సనా షేక్ అంది.