Begin typing your search above and press return to search.
డబ్బు కోసం అలాంటి పనులు చేయను! పూజాహెగ్డే
By: Tupaki Desk | 20 Dec 2022 10:30 AM GMTముంబై బ్యూటీ పూజాహెగ్డే తారా జువ్వలా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. వరుస విజయాలతో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఆరంభంలో ఒకటి రెండు చిత్రాలు ప్రతికూల ఫలితాలు అందించినప్పటికీ..అటుపై బ్యాక్ టూ బ్యాక్ సకసెస్ లతో బిజీ అయింది. ఇదే సమయంలో కోలీవుడ్ లోనూ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది.
దీంతో పూజ పారితోషికం భారీగా డిమాండ్ చేస్తుందని చాలా కాలంగానే వినిపిస్తుంది. అలాగే వ్యక్తిగత సిబ్బంది కోసం నిర్మాత నెత్తిన అధిక భారం వేస్తుందని...సొంత చార్టెడ్ ప్లైట్ వేసుకుని వచ్చినా దానిపైనా భారం తమపైనే వేస్తుందని ప్రచారం సాగింది. కోలీవుడ్ లో నిర్మాతాల సంఘమే అమ్మడి తీరుపై భగ్గుమంది. ఇది జరిగి కొన్ని నెలలు గడుస్తోంది.
ప్రస్తుతం పూజాహెగ్డే మరీ అంత సక్సెస్ ల్లో లేదు. చేతిలో అవకాశాలైతే ఉన్నాయి గానీ.... వాటిని వినియోగించుకోవడంలో తడబడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. అయినా సరే తగ్గేదేలే అంటూ బుట్టబొమ్మ పారితోషికం భారీగానే డిమాండ్ చేస్తుందని ప్రచారం సాగుతోంది. తాజాగా వీటిపై పూజాహెగ్డే స్పందించింది. 'పారితోషికం కోసం నిర్మాతల్ని ఇబ్బంది పెట్టలేదు. నేను అసలు రెమ్యునరేషన్ పెంచలేదు.
అవన్నీ మీడియాలో వస్తోన్న కట్టు కథనాలు. పారితోషికం కోసమే పనిచేయాలంటే? ఇప్పటికే చాలా సినిమాలకు అడ్వాన్సులు అందుకుని బిజీగా ఉండేదాన్ని. కానీ నేనంత బిజీగా లేను. మంచి కథల కోసం చూస్తున్నాను. అలాంటి కథలు నాముందుకొస్తే డబ్బు విషయమే కాదు. నిర్మాత ఇచ్చిన ఆఫర్ కే పనిచేస్తాను. ఒక సినిమాకు సంతకం చేసిన తర్వాత బాండ్ అయి పనిచేస్తాను. అది నా స్వభావం. నిర్మాతలొచ్చి అడ్వాన్స్ లు ఇస్తున్నారని తీసుకుని అకౌంట్ లో వేసుకోను.
ముందు కథ..ఆ తర్వాత నా పాత్ర ఎలా ఉంటుంది వంటి విషయాలు ఆలోచించుకుంటా. ఆ తర్వాత పారితోషికం విషయంలో రూపాయి పెరిగినా..తగ్గినా సంతకం చేస్తా. కేవలం డబ్బు కోసమే అయితే సినిమా రంగంలోకి వచ్చేదాన్ని కాదు. రకరకాల వ్యాపారాలు చేసి సంపాదించ్చొచ్చు. మరి అలా నేను ఎందుకు ఆలోచించలేదు? ఇది కూడా కొందరు ఆలోచిస్తే బాగుంటుందని' చివర్లో పంచ్ వేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఎస్ ఎస్ ఎంబీ 28'వ చిత్రంలో మహేష్ కి జోడీగా నటిస్తుంది. 'మహర్షి' తర్వాత రెండవ సారి సూపర్ స్టార్ తో తెరను పంచుకోవడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.