Begin typing your search above and press return to search.
అక్కడ ఇల్లు లేదు త్వరలో కొంటా : బన్నీ
By: Tupaki Desk | 14 Feb 2020 6:00 AM GMTఅల వైకుంఠపురంలో చిత్రంతో సక్సెస్ తో జోష్ మీదున్న అల్లు అర్జున్ మొన్నటి వరకు వరుసగా పార్టీ మూడ్ లో ఉన్నాడు. ఇండస్ట్రీ వారికి.. స్నేహితులకు.. కుటుంబ సభ్యులకు ఇలా వరుసగా పార్టీలు ఇచ్చిన బన్నీ ఇప్పుడు జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీతో పాటు ప్రముఖ సినీ జర్నలిస్ట్ అనుపమ చోప్రాకు అల్లు అర్జున్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఉన్నట్లుండి బాలీవుడ్ మీడియాకు బన్నీ ఇంటర్వ్యూలు ఇవ్వడంపై రకరకాలుగా చర్చలు వస్తున్నాయి.
అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడిరచాడు. పాన్ ఇండియా మూవీ చేస్తానంటూ చెప్పిన బన్నీ బాలీవుడ్ లో కూడా నటించే విషయమై ఆసక్తి చూపించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే ఇంటర్వ్యూలో ముంబయిలో తన ఇంటి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.
బన్నీ ముంబయికి వెళ్లినప్పుడు హోటల్ లో కాకుండా ఒక అపార్ట్ మెంట్ లో ఉంటాడు. ఆ అపార్ట్ మెంట్ ఆయన సొంతంది అంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలపై క్లారిటీ ఇస్తూ అది గీతా ఆర్ట్స్ ముంబయి గెస్ట్ హౌస్. నాకు ముంబయి అంటే చాలా ఇష్టం. అందుకే తరచు వస్తూ ఆ గెస్ట్ హౌస్ లో స్టే చేస్తూ ఉంటాను. నేను సొంతంగా ముంబయిలో ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను. త్వరలోనే ముంబయిలో సొంతంగా ఒక ఇల్లు తీసుకుంటానంటూ ఇంటర్వ్యూలో బన్నీ చెప్పుకొచ్చాడు.
నెలకు రెండు నెలలకు ఒకసారి వెళ్లే ముంబయిలో సొంత ఇల్లు ఎందుకు బన్నీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం బన్నీ ముంబయిలో ఇల్లు కొనాలని అనుకుంటున్నాడు కనుక హిందీ సినిమాల్లో నటించే ఆలోచన ఏమైనా ఉందేమో అనుకుంటున్నారు. ఇక బన్నీ తదుపరి చిత్రం విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ నెల చివర్లో రెండవ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.