Begin typing your search above and press return to search.

ట్రంప్ గురించి ఇలియానా ఏం మాట్లాడింది?

By:  Tupaki Desk   |   14 Oct 2016 9:48 AM GMT
ట్రంప్ గురించి ఇలియానా ఏం మాట్లాడింది?
X
బాలీవుడ్డుకెళ్లాక చాలా ఓపెన్ గా ఉంటోంది ఇలియానా. ఏ విషయం మీదైనా బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తోంది. తన కంపు నోటితో రోజుకో వివాదాన్ని కొని తెచ్చుకుంటూ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విషయంలో కూడా ఆమె స్పందించింది. బాలీవుడ్ సెలబ్రెటీల్ని ట్రంప్ కు మద్దతుగా పెర్ఫామ్ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ ఆహ్వానించడం మంచి పరిణామమని అంటూనే.. తాను వ్యక్తిగతంగా ట్రంప్ ను ఎంత మాత్రం సపోర్ట్ చేయనని ఇలియానా స్పష్టం చేసింది. మహిళల గురించి కించపరిచేలా ట్రంప్ అనేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇలియానా ఈ వ్యాఖ్యలు చేసింది.

‘‘బాలీవుడ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. అందుకే అమెరికా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఈవెంట్లోనూ బాలీవుడ్ తారలు ప్రచారం చేస్తున్నారు ఐతే నేను డొనాల్డ్ ట్రంప్ ను సపోర్ట్ చేస్తానా అంటే మాత్రం లేదనే చెబుతాను’’ అని ఇలియానా అంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తే వెళ్తారా అని ఇలియానాను అడిగితే.. ‘‘నేను ఏ ఈవెంట్లో పాల్గొనాలన్నా అందుకోసం కొంచె బ్యాంగ్రౌండ్ వర్క్ చేస్తాను. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమైతే అందులో పాల్గొనే వాళ్లకు మంచిదే’’ అంటూ పొంతన లేని సమాధానం ఇచ్చింది ఇల్లీ. ఇక వాల్ట్ డిస్నీ లాంటి ప్రఖ్యాత సంస్థ బాలీవుడ్లో చేదు అనుభవాలతో ఇక్కడ బిజినెస్ క్లోజ్ చేసేయడంపై ఇలియానా స్పందిస్తూ.. ‘‘బాలీవుడ్లో పరిస్థితి ఏమంత ఇబ్బందికరంగా లేదు. ఇక్కడ చాలా సినిమాలు బాగా ఆడుతున్నాయి. విమర్శకులతో పాటు ప్రేక్షకులకూ సినిమాలు నచ్చుతున్నాయి. ఈ మధ్య ధోని.. పింక్ లాంటి సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. సినిమాల బిజినెస్ విషయంలో అంత ఇబ్బందులేమీ లేవు’’ అని ఇలియానా చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/