Begin typing your search above and press return to search.
అది తన జీవితం కాదంటున్న సన్నీ
By: Tupaki Desk | 21 Sep 2016 9:01 AM GMTప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న అడల్ట్ స్టార్ గా సన్నీ లియోన్ ఎదిగింది! ఇక, ఇండియాకి ఒక టీవీ షో ద్వారా దిగుమతి అయింది. తరువాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కలెక్షన్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ కొట్టేసింది. సన్నీ సినిమా విడుదలైందంటే కపూర్లూ ఖాన్లూ సినిమాలకు వచ్చే రేంజిలో కలెక్షన్లు ఇండియాలో వస్తున్నాయి. ఆమెకు ఇక్కడున్నక్రేజ్ అలాంటింది. అయితే, ఇటీవలే సన్నీలియోన్ వ్యక్తిగత జీవితంపై ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ మధ్యనే టొరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దీన్ని ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీని డిసెంబర్ లో అన్ని దేశాల్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సన్నీకి అంతర్జాతీయంగా మాంచి క్రేజ్ ఉంది కాబట్టి, ఈ చిత్రానికి గిరాకీ బాగానే ఉంటుందని వారి అంచనా. అయితే... ఆ చిత్రాన్ని ఇండియాలో విడుదల చేయొద్దని సన్నీలియోన్ అంటోంది!
‘మోస్ట్లీ సన్నీ’ అనే చిత్రంలో బాల్యం నుంచి సన్నీ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలకు తెరకెక్కించారట. కెనడాలోని ఒక సిక్కు కుటుంబంలో కరన్ జీత్ కౌర్ ఓరాగా జన్మించి, తరువాత సన్నీ లియోన్ గా పేరు మార్చుకుని పోర్న్ ఇండస్ట్రీలో టాప్ పేయింగ్ నటిగా ఎదిగిన క్రమమంతా ఈ డాక్యుమెంటరీలో ఉందట. అయితే, ఈ చిత్రం తను అనుకున్నట్టుగా తెరకెక్కలేదని సన్నీ అంటోంది. తనకు సంబంధం లేని చాలా ఘటనలు ఉన్నాయని చెబుతోంది. తన వ్యక్తిగత జీవితం గురించి తనకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుందని చెబుతోంది.
‘నా జీవితంపై వచ్చే చిత్రాన్ని నా స్నేహితులూ బంధువులూ మధ్య కూర్చుని చూసేదిగా ఉండాలని ఆశపడ్డాను. కానీ అందుకు భిన్నంగా ఉంది. నేను వద్దనుకున్న చాలా విషయాలు దాన్లో ఉన్నాయి. చూడొద్దనుకున్న ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. ఇది నా జీవితం కాదు. నా జీవితం మీద ఇంకొకరి అభిప్రాయం మాత్రమే ఇది’ అని సన్నీ చెబుతోంది.