Begin typing your search above and press return to search.
ఓవర్ వెయిట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా: ఉపాసన
By: Tupaki Desk | 10 March 2019 9:45 AM GMTరామ్ చరణ్ సతీమణిగా మాత్రమే కాదు.. అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప రెడ్డి గారి మనవరాలిగా ఉపాసన పేరు ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అపోలో గ్రూప్ కు సంబంధించిన వ్యవహారాలలో కూడా ఉపాసన యాక్టివ్ గా పాల్గొంటూ ఉంటారు. ఉపాసన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చాలా ప్రొఫెషన్.. పర్సనల్ లైఫ్.. ఇలా చాలా విషయాలు పంచుకున్నారు.
చెన్నైలో పుట్టి పెరిగానని.. అమ్మమ్మ తాతయ్యలతో చాలా అనుబంధం ఉందని తెలిపారు ఉపాసన. కాలేజి రోజులలో వెయిట్ ఎక్కువగా ఉండేదానినని.. దాంతో ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు. అందుకే ప్రొఫెషన్.. ఫ్యామిలీ కాకుండా తన ఫస్ట్ ప్రయారిటీ ఆరోగ్యానికే అని చెప్పారు. కాలేజి చదువు పూర్తయిన తర్వాత 'బీ పాజిటివ్' మ్యాగజైన్ ను ప్రారంభించానని చెప్పారు. అప్పటి నుంచి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వీడియోలు పోస్ట్ చేస్తూ ఫిట్నెస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. తనొక జంతుప్రేమికురాలినని బ్లూక్రాస్ వారు రక్షించిన చాలా జంతువులను దత్తత తీసుకొని తమ ఫామ్ హౌస్ లో ఉంచామని.. వాటిని ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటున్నామని తెలిపారు.
చరణ్ ను వివాహం చేసుకోవడం తన జీవితంలో జరిగిన బెస్ట్ థింగ్స్ లో ఒకటని.. తనను యువరాణి లాగా చూసుకుంటారని అన్నారు.ఇప్పటికి తమ వివాహం జరిగి ఏడేళ్ళయిందని చెప్పారు. మామగారు చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్ అని.. మహిళలను ఎంతో గౌరవిస్తారని చెప్పారు.