Begin typing your search above and press return to search.

డాడీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను: చరణ్

By:  Tupaki Desk   |   28 Jan 2021 5:01 AM GMT
డాడీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను: చరణ్
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో హోమ్ బ్యానర్ లో చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. చిరు - చిరుత కలసి నటిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చరణ్ సైతం తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాడని తెలుస్తోంది. తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడిన చరణ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ గ్రేట్ యాక్టర్ అయిన తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఇకపోతే చరణ్ నటించిన 'మగధీర' సినిమాతో చిరంజీవి గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. అలానే 'బ్రూస్ లీ' సినిమా క్లైమాక్స్ లో చిరు ఓ ఫైట్ లో కనిపించాడు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి అభిమానులను అలరించనున్నారు. 'ఆచార్య'లో చరణ్ ఫుల్ లెంత్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో 'సిద్ధ' అనే పాత్రలో చరణ్ కనిపిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న 'ఆచార్య' టీజర్ రేపు విడుదల కానుంది. ఇది రాంచరణ్ వాయిస్ ఓవర్ తో రానుందని సమాచారం.