Begin typing your search above and press return to search.

ఆ సమయంలో చాలా బాధగా అనిపించింది : రాజమౌళి

By:  Tupaki Desk   |   20 Jan 2023 8:05 AM GMT
ఆ సమయంలో చాలా బాధగా అనిపించింది : రాజమౌళి
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమాను ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఆస్కార్‌ కు నామినేట్ చేయక పోవడం పట్ల మొదటి సారి స్పందించాడు. దేశం తరపున అధికారికంగా ఆస్కార్‌ ఎంట్రీ లభించక పోవడం పట్ల నిరాశ చెందాను. ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని రాజమౌళి అన్నాడు.

ఇంకా జక్కన్న మాట్లాడుతూ... ఆర్‌ఆర్ఆర్ సినిమా దేశం తరపున ఆస్కార్ అవార్డులకు అధికారికంగా ఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేది. విదేశీయులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా వారి నిబంధనలు ఏంటీ... ఎలా వర్క్ చేస్తుంది.. ఏ ప్రాతిపదికన ఆస్కార్‌ కు ఎంపిక చేస్తారు అనే విషయం నాకు తెలియదు కనుక నేను ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడాలి అనుకోవడం లేదు.

ఆస్కార్‌ కు అధికారికంగా ఎంట్రీ సాధించక పోవడం పట్ల ఎక్కువగా ఆలోచించలేదు. దాని గురించి ఆలోచిస్తూ ఉండే వాళ్లం కాదు మేము. ముందడుగు వేయాలి అనుకున్నాం.. అందుకోసం మా వంతు ప్రయత్నాలు చేశాం. మన దేశంకు చెందిన లాస్ట్‌ ఫిల్మ్‌ షో కు ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌ లో చోటు దక్కడం ఆనందంగా ఉందని జక్కన్న పేర్కొన్నాడు.

భారత్ నుండి అధికారిక ఎంట్రీ దక్కక పోవడంతో రాజమౌళి అంతర్జాతీయ స్థాయి ప్రమోషనల్‌ ఏజెన్సీ తో ఒప్పందం కుదుర్చుకుని నేరుగా ఆస్కార్‌ కి నామినేట్‌ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్ అవార్డుతో పాటు పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్థాయి అవార్డులు ఆర్‌ ఆర్‌ ఆర్‌ ను వరించాయి.

ఆస్కార్‌ నామినేషన్స్ పై ఇంకా కూడా ఆర్ ఆర్‌ ఆర్‌ యూనిట్‌ సభ్యులు ఆసక్తిగా ఉన్నారు. నాటు నాటు షార్ట్‌ లిస్ట్‌ లో ఉండటంతో నామినేషన్స్ ను దక్కించుకునే అవకాశం ఉంది అంటూ యూనిట్‌ సభ్యులతో పాటు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఉన్నారు.

జనవరి 24వ తారీకున ఆస్కార్‌ నామినేషన్స్ ను ప్రకటించనున్నారు. మార్చి నెలలో అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.