Begin typing your search above and press return to search.
ఈ నటికి 'కాంప్రమైజ్' మెసేజ్ లు చాలా వచ్చాయట
By: Tupaki Desk | 4 July 2019 7:02 AM GMTఈ భాష ఆ భాష అనే తేడా లేకుండా ప్రతి భాష సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన కఠిన నిజం. ఈమద్య కాలంలో కాస్త తగ్గినా కూడా గతంలో కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉండేదని కొందరు హీరోయిన్స్ ఇటీవల కాలంలో మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయం తెల్సిందే. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుని కొందరు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం నడిపించే వారు. తాజాగా ఈ విషయంలో మలయాళం ముద్దుగుమ్మ గాయత్రి సురేష్ సంచలన కామెంట్స్ చేసింది.
నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన కొత్తలో ఈమె కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొందట. అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో చాలా మంది నా మొబైల్ కు 'కాంప్రమైజ్' కు ఓకేనా అంటూ మెసేజ్ చేసే వారు. నేను వారందరికి కూడా నో అనే చెప్పాను. కాంప్రమైజ్ కాకుండానే ఇండస్ట్రీలో రాణించాలని భావించానంటూ చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీలో కొత్త అమ్మాయిలు కాంప్రమైజ్ కాకుండా రాణించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని.. సులువుగా ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకోవాలంటే కాంప్రమైజ్ అవ్వడం తప్ప మరే దారి లేదని కొందరు భావిస్తూ ఉంటారు. కాని ట్యాలెంట్ ఉంటే కాంప్రమైజ్ కానక్కర్లేదని గాయత్రి వంటి నటి నిరూపించారు. గత రెండు మూడు సంవత్సరాలుగా సోషల్ మీడియా ద్వారా కాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది చాలా తక్కువ అయ్యింది.