Begin typing your search above and press return to search.
త్రిష అంటే క్రష్ అంటున్న జగపతి బాబు
By: Tupaki Desk | 9 May 2017 11:22 AM GMTతనకేమనిపిస్తే అది మాట్లాడుతుంటాడు సీనియర్ హీరో జగపతి బాబు. మాటలకు ముసుగేసి మాట్లాడటం జగపతికి అలవాటు లేదు. ఓపెన్ గా చాలా విషయాలు డిస్కస్ చేస్తుంటాడు. అందుకే ఆయన ఇంటర్వ్యూలో ఆసక్తి రేపుతుంటాయి. సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు అనేక ఆసక్తికర విషయాలు చెప్పాడు.
తన కంటే వయసులో చాలా చిన్నదైన హీరోయిన్ త్రిష అంటే తనకు క్రష్ అని జగపతిబాబు ఈ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. త్రిషతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని ప్రయత్నించానని.. కానీ కుదర్లేదని జగపతి చెప్పాడు. ప్రియమణి చాలా హాట్ అంటూ మరో హాట్ కామెంట్ కూడా చేశాడు జగపతి. హీరో అర్జున్ తనకు ప్రాణ స్నేహితుడని.. జూనియర్ ఎన్టీఆర్ చాలా దగ్గరివాడని చెప్పాడు.
హీరోయిన్ సౌందర్యతో ఎఫైర్ అంటూ వార్తలపైనా జగపతి స్పందించాడు. సౌందర్య ఎవరినీ అంత తొందరగా నమ్మేది కాదని.. తనను మాత్రం చాలా అభిమానించేదని అన్నాడు. ఆమె కుటుంబానికి కూడా తనను దగ్గర చేసిందన్నాడు. తమ మధ్య అందరూ అనుకున్నట్లు ఎఫైర్ ఏమీ లేదని స్పష్టం చేశాడు.
లెజెండ్ సినిమాకు ముందు తాను పడ్డ ఇబ్బందుల గురించి జగపతి బాబు మాట్లాడాడు. ఆ సినిమాకు ముందు మూడేళ్లలో చాలా ఖాళీగా ఉన్నానని.. అవకాశాలు లేక రోడ్ల మీద ఊరికే స్టిక్ పట్టుకుని నడిచిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపాడు. తాను సినిమాల్లోకి రావడం తన తల్లికి ఇష్టం లేదని.. ఆమె మాట విననందుకు రెండేళ్లు పాటు తనతో మాట్లాడలేదని చెప్పాడు. అలాగే సిగరెట్ కాల్చానని.. ఓ అమ్మాయితో కనిపించానని.. ఇలా రకరకాల కారణాలతో ఏళ్లకు ఏళ్లు తన తల్లి తనతో మాట్లాడుకుండా ఉండిపోయిందని చెప్పాడు.