Begin typing your search above and press return to search.

కరీనాతో నాకు ఎఫైర్ ఉంది.. ఇదే సాక్ష్యం

By:  Tupaki Desk   |   13 Oct 2017 4:13 AM GMT
కరీనాతో నాకు ఎఫైర్ ఉంది.. ఇదే సాక్ష్యం
X
బాలీవుడ్ లో కమాల్ ఆర్.ఖాన్ ఓ క్రిటిక్ ఉన్నాడు. తనను తాను గొప్ప విమర్శకుడిగా చెప్పుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్లో.. ట్వీట్లో చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఈ క్రిటిక్ తనకు కరీనా కపూర్ తో అఫైర్ ఉందని... నాలుగేళ్లు ఆమెతో అఫైర్ కొనసాగించానంటూ బాంబులాంటి ఓ ట్వీట్ పేల్చాడు. తమ రిలేషన్ షిప్ కు ఇదొక్కటే సాక్ష్యమంటూ ఆమె పక్కన నిల్చుని దిగిన ఓ ఫొటో పెట్టాడు. చక్కగా సైఫ్ అలీఖాన్ ను పెళ్లి చేసుకుని కొడుకును కూడా కని హ్యాపీగా ఉన్న ఆమెతో రిలేషన్ అంటాడేంటా అని అంతా ఉలిక్కిపడ్డారు. చివర్లో ఈ ట్వీట్ ను కంగనా రనౌత్.. ఆమె సిస్టర్ రంగోలికి దీనిని హ్యాష్ ట్యాగ్ చేశాడు.

ఇక్కడ విషయమేంటంటే ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తనను ప్రేమ పేరు చెప్పి మోసగించాడంటూ తెగ ఆరోపిస్తోంది. దీనిపై పబ్లిగ్గా కామెంట్లు చేస్తూ అతడిని బజారుకీడ్చేసింది. కొన్నాళ్లు దీనిపై సైలెంట్ గా ఉన్న హృతిక్ నోరు విప్పి కంగనా పచ్చి అబద్ధాలు చెబుతోందని కొట్టిపారేశాడు. కంగనాయే వెంటపడి తనను వేధించేదంటూ ఆరోపణలు చేశాడు. ఈ వ్యవహారంలో బాలీవుడ్ లోని సోనమ్ - ఫర్హాన్ అఖ్తర్ -కరణ్ జోహార్ లాంటి టాప్ సెలబ్రిటీలు హృతిక్ కే అండగా నిలిచారు. దీనిపై కంగనా సోదరి రంగోలి అందరినీ బ్లేమ్ చేస్తూ తిట్ల దండకం అందుకుంది.

ఈ మొత్తం వ్యవహారంలో కంగనా హృతిక్ తనతో రిలేషన్ మెయిన్ టెయిన్ చేశాడు అనడానికి అతడితో కలిసి తీయించుకున్న ఫొటోలే రుజువుగా చూపిస్తోంది. కలిసి ఫొటో తీయించుకున్న మాత్రాన అఫైర్ ఉందని ప్రూవ్ చేయలేరంటూ కంగనా - ఆమె చెల్లెలు రంగోలికి కౌంటర్ రిటార్ట్ ఇవ్వడానికి కమార్ ఆర్. ఖాన్ ఇలా కరీనా పేరు.. ఆమె ఫొటో వాడేశాడన్న మాట. అలాంటివి బోలెడన్ని చూపించగలమంటూ వాళ్ల పేర్లు హ్యాష్ ట్యాగ్ చేసి మరీ సెటైర్ వేశాడు.

బేసిగ్గా కమాల్ ఆర్. ఖాన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వేలెడుతూ ఉంటాడు. వివాదాలనే పబ్లిసిటీగా మార్చుకుని న్యూస్ లో కనిపిస్తూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయనగారిదంతా రామ్ గోపాల్ వర్మ స్టయిల్. కానీ ఈసారి మాత్రం ఇతగాడేసిన పంచ్ బాగానే పేలింది.