Begin typing your search above and press return to search.
ధర్మ రక్షణ కోసం అధ్యక్షుడిగా..!
By: Tupaki Desk | 19 Jan 2019 5:03 PM GMTకొన్నాళ్ల క్రితం మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ పై సంచలన విమర్శలు చేసిన నటుడు సీనియర్ నరేష్ ఆ తర్వాత ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడటంతో ప్రస్తుతం అధ్యక్షుడితో రాజీ పడి పని చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా నరేష్ కు మా అధ్యక్షుడు అవ్వాలనే కోరిక ఉంది. ఆ విషయాన్ని తాజాగా ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెళ్లడించాడు. తనకు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్షుడిగా ఒక సారి పని చేయలని ఉంది. త్వరలో జరుగబోతున్న మా ఎన్నికల్లో నేను పోటీ చేస్తానంటూ ప్రకటించాడు.
ప్రతి సారి మా అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం అవుతూ వస్తుంటాయి. ఈసారి కూడా ఏకగ్రీవం అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఏకగ్రీవం కాకుంటే మాత్రం తప్పకుండా పోటీకి అయినా నేను సిద్దం అంటూ నరేష్ ప్రకటించాడు. అయితే మా అధ్య్ష పదవిపై మోజుతో తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని ధర్మంను రక్షించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అధ్యక్ష ఎన్నికలు లేకుండానే మా అధ్యక్షుడి ఎన్నిక అవుతుందని విశ్వసిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
మా అధ్యక్షుడిగా ఎవరు పని చేసినా ఒక్క పర్యాయం కంటే ఎక్కువ సార్లు చేయవద్దని తమలో తాము అనుకున్నాం. ఒక్క పర్యాయం కంటే ఎక్కువ ఉండటం వల్ల విమర్శలు - వివాదాలు వస్తాయనే ఉద్దేశ్యంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, అందుకు అందరు కూడా మద్దతు తెలిపారని నరేష్ అన్నారు. తాను కూడా వచ్చే సారి మా అధ్యక్షుడి ఎన్నికై ఒకే సారి అధ్యక్షుడిగా కొనసాగుతానని, ఆ తర్వాత మళ్లీ అధ్యక్ష పదవిని కోరుకోనంటూ నరేష్ వ్యాఖ్యలు చేశాడు. ఆయన ధీమా చూస్తుంటే ఏకగ్రీవంగానే మా అధ్యక్షుడిగా ఆయన అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.