Begin typing your search above and press return to search.

100 కోట్ల క్లబ్ లో చేరానన్న కమల్

By:  Tupaki Desk   |   2 Aug 2017 5:54 AM GMT
100 కోట్ల క్లబ్ లో చేరానన్న కమల్
X
తమిళ్ లో టీవీ షోలు వివాదాస్పదం అవడం కొత్తేమీ కాదు కానీ.. ఇప్పుడ కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ్ బిగ్ బాస్ మాత్రం మరీ వివాదాలకు కేంద్ర బిందువు అయిపోతోంది. నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం చుట్ట న్యాయ వివాదాలు తిరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ పార్టిసిపెంట్ ను చెరి(స్లమ్ లో నివసించే వ్యక్తి) అని సంబోధించడంతో.. అటు ఛానల్ తో పాటు ఇటు కమల్ హాసన్ పై కూడా పుతియ తమిళగం ప్రెసిడెంట్ డా.కె. కృష్ణ స్వామి అనే వ్యక్తి 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.

దీనిపై ఇప్పుడు తన స్టైల్లోనే రియాక్ట్ అయ్యారు కమల్ హాసన్. “దేశంలో ఏ నటుడూ అందుకోలేని 100 కోట్ల క్లబ్ లో నేను ఇప్పుడు చేరాను. నా ఉద్దేశ్యంలో ఈ 100 కోట్ల క్లబ్ కూడా అందరూ గుర్తుంచుకోదగ్గదే. గుర్తింపు కోసం ఇలాంటి కేసే వాళ్లను స్టార్లుగా మార్చే క్లబ్ ఇది. ఎలాంటి గుర్తింపు లేని వారు.. డబ్బు అవసరం విపరీతంగా ఉన్నవారు అయి ఉంటారు. అయినా సరే నేను ఏమీ ఇవ్వబోవడం లేదు” అని చెప్పారు కమల్ హాసన్. ఇదే కృష్ణస్వామితో తనకు ఉన్న గత అనుభవాన్ని కూడా గుర్తు చేసుకున్నారు కమల్.

“నా సినిమా శాండియార్ కు పేరు మార్చాలని పోరాడిన మహానుభావుడు కూడా ఈయనే అనుకుంటా. ఆ టైటిల్ కారణంగా మనోభావాలు దెబ్బ తిన్నాయని పోరాడాడు. కానీ కొన్నేళ్ల తర్వాత అదే పేరుతో ఆ సినిమాను రిలీజ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన కమాండ్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. కానీ నేను విభిన్నమైన జంతువుని.. స్వేచ్ఛగా పుట్టాను.. బతకడానికి పోరాడతాను.. అలాగే ఛస్తాను” అంటూ ఈ కేసుపై తన ఉద్దేశ్యాన్ని తెగేసి చెప్పారు కమల్ హాసన్.