Begin typing your search above and press return to search.

ఇండియాలో టాప్ రెమ్యునరేషన్ నాదే: వివి.వినాయక్

By:  Tupaki Desk   |   28 Sep 2022 4:15 AM GMT
ఇండియాలో టాప్ రెమ్యునరేషన్ నాదే: వివి.వినాయక్
X
మాస్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వివి వినాయక్ సినిమాలు అంటే ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద చాలా సందడిగా కనిపించేవి. స్టార్ హీరోల ఇమేజ్ కు తగ్గట్టుగా ఆయన ఇచ్చే మాస్ ఎలివేషన్స్ మామూలుగా వర్కౌట్ కాలేదు.

అప్పట్లో సుమోలతో ఒక ట్రెండ్ సెట్ చేసిన వినాయక్ హీరోల రేంజ్ ను మరో లెవెల్ కి తీసుకు వెళ్ళాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో ఆది, నితిన్ తో దిల్ ఇలా వరుసగా సక్సెస్ అందుకొని మూడవ సినిమాకి బాలయ్య బాబుతో చెన్నకేశవరెడ్డి అనే సినిమా తీశాడు.

కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. కానీ ఇటీవల మళ్ళీ విడుదల చేసినప్పటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడం విశేషం. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వినాయక్ తనకు అప్పట్లో వచ్చిన పారితోషషికం గురించి వివరణ ఇచ్చిన విధానం హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో మూడవ సినిమాతోనే సక్సెస్ అందుకున్న తర్వాత అత్యధికంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న తెలుగు దర్శకుడిగా క్రేజ్ అందుకున్నాడట.

అంతేకాకుండా అప్పట్లో అంతకంటే ఎక్కువ స్థాయిలో తనకు టాప్ రెమ్యునరేషన్ ఇచ్చారు అని ఒక విధంగా చెప్పాలి అంటే ఇండియాలోనే ఏ దర్శకుడికి ఇవ్వనంత టాప్ రెమ్యునరేషన్ తనకు వచ్చింది అని కూడా వినాయక్ తెలిపారు. మాస్ సినిమాలకు అప్పట్లో ఉన్న హైప్ అలాంటిది అని చెప్పవచ్చు. అందుకే ఈ దర్శకుడికి ఆ స్థాయిలో ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు.

ఠాగూర్ సినిమా తర్వాత కూడా కృష్ణ బన్నీ అదుర్స్ నాయక్ ఇలా మరికొన్ని సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ వినాయక్ అదుర్స్ సినిమా తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ అయితే రాలేదు. అక్కినేని అఖిల్ తో చేసిన అఖిల్ సినిమా డిజాస్టర్ కావడంతో అప్పటినుంచి గుడ్ వినాయక్ బ్రాండ్ పడిపోయింది.

ఇక తర్వాత మెగాస్టార్ మళ్ళీ అతని నమ్మి ఖైదీ నెంబర్ 150 చేసే అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా కమర్షియల్ గా పరవాలేదు అనిపించింది కానీ ఆ తర్వాత సాయి ధరంతేజ్ తో చేసిన ఇంటిలిజెంట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ప్రస్తుతం బెల్లంకొండ హీరోతో చత్రపతి రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితేనే వినాయక్ మళ్ళీ నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.