Begin typing your search above and press return to search.
`మా` బాధలేమిటో తెలుసన్న మంచు విష్ణు
By: Tupaki Desk | 27 Jun 2021 12:30 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎవరికి వారు ఇప్పటి నుంచే వార్ లో దిగుతున్నామని ప్రకటిస్తున్నారు. ఇంతకుముందు ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ని ప్రకటించారు. ఆ తర్వాత మంచు విష్ణు రేసులో నిలుస్తున్నారు.
తాను మా అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని తాజాగా అధికారికంగా ప్రకటించారు విష్ణు. ఆ మేరకు ఒక లేఖను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మా కుటుంబంలో కలతలు బాధలు తనకు తెలుసునని ఎన్నికల్లో నామినేషన్ వేసి పోటీ చేయడాన్ని గౌరవప్రదంగా భావిస్తానని అన్నారు. బాధలేమిటో తెలుసు.. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందామని విష్ణు పిలుపునిచ్చారు.
తన కుటుంబానికి తనకు పేరు తెచ్చిన పరిశ్రమకు రుణపడి ఉన్నానని.. తన తండ్రి పరిశ్రమకు.. అసోసియేషన్ కు సేవ చేశారని అన్నారు. తండ్రి బాటలోనే తాను కూడా సేవ చేస్తానని విష్ణు వ్యాఖ్యానించారు.
`మా` ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉపయోగపడుతుందని.. పెద్దల అనుభవాలు.. యువరక్తం ఆలోచనలతో ముందుకు నడవాలన్నదే తన ప్రయత్నమని అన్నారు. అధ్యక్ష పదవి కి పోటీ పడి గెలుస్తానని ధీమాను వ్యక్తం చేశారు.
పోటీబరిలో మంచు విష్ణు తన ప్యానెల్ ని ప్రకటించాల్సి ఉండగా ప్రకాష్ రాజ్ ఇప్పటికే రేసులో ముందున్నారు. జీవిత రాజశేఖర్ స్వతంత్య్ర అభ్యర్థిగా మా అధ్యక్ష పదవికి పోటీపడనున్నారు. హేమ కూడా ఇదే తరహాలో పోటీ చేస్తానని తెలిపారు.