Begin typing your search above and press return to search.

ఇజం నచ్చలేదు.. పవనిజం నచ్చింది

By:  Tupaki Desk   |   10 Oct 2017 8:59 AM GMT
ఇజం నచ్చలేదు.. పవనిజం నచ్చింది
X
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎవరికీ తెలియదు. ఒకవేళ మాట్లాడినా అది అర్డంమవ్వడానికి సమయం చాలానే పడుతుంది. ఒకసారి నచ్చిందే ఆ నచ్చలేదు అని లాజిక్ గా చెప్పే ప్రయత్నం చేస్తాడు. రీసెంట్ గా సొషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి మరొక సెన్సేషన్ కామెంట్ చేశాడు.

పవన్ ఇష్టమంటూనే మరో వైపు నచ్చలేదు అనే కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ రాసిన 'ఇజం' పుస్తకం చదివిన వర్మ ఫెస్ బుక్ ద్వారా ఒక పవన్ కి సందేశాన్ని ఇచ్చాడు. ముందుగా పార్టీ పెట్టాలనుకున్న ఆలోచన బావుంది. మీలో నచ్చేది నిజాయితీ. అదే విధంగా పార్టీ పెట్టినప్పుడు మొదటి సారి మీరు ఇచ్చిన స్పీచ్ కూడా నాకు బాగా నచ్చింది. ఇక మీరు రాసిన ఇజం పుస్తకం కూడా చాలా ఇష్టంగా చదివాను. ఆ బుక్ చదివాకా నాకు ఒక్కటే అర్థమైంది. బుక్ లో ఉన్న మ్యాటర్ కంటే మీలోనే ఎక్కువ జ్ఞానం ఉంది. కాకపోతే కొన్ని అంశాలు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నాయి. ప్రస్తుతం సమాజానికి కావాల్సింది 100% పవనిజం. బ్రుస్లి కేవలం మార్షల్ ఆర్టిస్ట్ కాదు మంచి విజన్ ఉన్న వ్యక్తి. అయన ఒక మాట చెప్పారు. జ్ఞానం పైకి ఎక్కడానికి ఉపయోగించే నిచ్చెన. మనం ఎక్కిన మెట్టును వదిలి మరో మెట్టు ఎక్కుతూ ఉండాలి. అంతేకానీ మనం ఎక్కిన మెట్లన్నీ పోగేస్తే మరింత పైకి వెళ్లలేం.

అంతే కాకుండా మనల్ని ముందుకు నడిపించేదాన్ని మనం నడిపించకూడదని చెప్పారు. ఇప్పుడు అయన గురించి ఎందుకు చెబుతున్నాను అంటే.. అతని స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆయన మరొకరిని చూసి నేర్చుకోవడానికి ఇష్టపడరు. మనం చేసే ప్రతి పని మన స్టైల్ లోనే ఉండాలి. మీ శ్రేయోభిలాషిగా ఒక్కటే చెబుతున్నా ఇతర ఆలోచనలను మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. ఫైనల్ గా మీరు రాసిన ఇజం పుస్తకం నిరాశపరిచింది. కానీ నాకు పవనిజమ్ పై నమ్మకం ఉందని వర్మ వివరణ ఇచ్చాడు.