Begin typing your search above and press return to search.

బోల్డ్ ఇమేజ్ నుంచి బయటకు రావాలంట!

By:  Tupaki Desk   |   29 Aug 2019 1:30 AM GMT
బోల్డ్ ఇమేజ్ నుంచి బయటకు రావాలంట!
X
ఎంతచెట్టుకు అంత గాలి.. పీత కష్టాలు పీతవి.. ఇలాంటి సామెతలన్నీ ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ కు కరెక్ట్ గా సూట్ అవుతాయి. ఎందుకంటే చాలామంది హీరోయిన్లకు అవకాశాలు లేక అల్లాడుతుంటారు. కానీ పాయల్ కు మంచి ఆఫర్లే ఉన్నాయి. చాలామంది హీరోయిన్లు ఎంత ట్రై చేసినా 'బోల్డ్ ఇమేజ్' రాదు. కానీ పాయల్ కు మొదటి సినిమాతోనే బోల్డ్ ఇమేజ్ వచ్చేసింది. అయితే ఇక్కడే ఉంది సమస్య.. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టుగా ఈ బోల్డ్.. హాట్ ఇమేజ్ ఇక చాలు బాబోయ్ అంటోంది పాయల్.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను నిజజీవితంలో ఒక సింపుల్.. హోమ్లీ అమ్మాయి అనే విషయం చెప్పుకొచ్చింది. కానీ మొదటి సినిమా 'RX100' లో పోషించిన పాత్ర ఆడియన్స్ కు డీప్ గా కనెక్ట్ అయిందనుకుంటున్నానని.. అందుకే తనకు బోల్డ్ ఇమేజ్ వచ్చిందేమోనని తెలిపింది. ఈ ఇమేజ్ వల్లే సెట్స్ లో తన దగ్గరకు రావాలంటే కొందరు భయపడుతున్నారని ఓ కొత్త విషయం వెల్లడించింది.

ఈ బోల్డ్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోవడం తనకు ఇష్టం లేదని.. వీలైనంత త్వరగా ఇందులోనుంచి బయటకు రావాలని ఉందంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది. పాయల్ చెప్పేది కూడా నిజమే. గతంలో హెబ్బా పటేల్ కు ఇలాంటి బోల్డ్ ఇమేజ్ వచ్చింది కానీ అందులో నుంచి బయటపడలేక ఫేడ్ అవుట్ అయింది. అందుకే కియారా అద్వాని లాంటి హీరోయిన్లను పాయల్ ఫాలో అవ్వాలి. కియారా ఒకవైపు 'లస్టు స్టోరీస్' చేస్తూనే మరోవైపు ఇన్నోసెంట్ అమ్మాయి పాత్రలో నటిస్తుంది. పాయల్ కూడా అలా చేస్తే ఆల్ రౌండర్ అనిపించుకోగదు. లేకపోతే RX.. RDX తర్వాత AK47.. హాటు మిస్సైల్ లాంటి అవకాశాలే వస్తాయి.!