Begin typing your search above and press return to search.

అఖిల్ ని పెళ్లాడేస్తానంటూ యాంక‌ర్ గుస్సా

By:  Tupaki Desk   |   22 July 2020 6:00 AM GMT
అఖిల్ ని పెళ్లాడేస్తానంటూ యాంక‌ర్ గుస్సా
X
అక్కినేని నాగార్జున‌కు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ చెప్పాల్సిన ప‌నే లేదు. రొమాంటిక్ హీరోగా ఆయ‌నో ట్రెండ్ సెట్ట‌ర్. న‌వ మ‌న్మ‌థుడిగా గాళ్స్ గుండెల్లో నిలిచాడు. 60 ఏజ్ కింగ్ అయ్యాకా ఇంకా ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ కించిత్ కూడా త‌గ్గ‌లేదు. అయితే ఆయ‌న వార‌స‌త్వాన్ని వార‌సులు కాపాడుతున్నారా? అంటే నాగ‌చైత‌న్య‌కు రొమాంటిక్ హీరోగా ఇమేజ్ ఉంది. కానీ చైని ఇప్ప‌టికే స‌మంత పెళ్లాడేసింది కాబ‌ట్టి గాళ్స్ ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థ‌తి. ఇక అక్కినేని చియాన్ అఖిల్ సంగ‌తేమిటి? అంటే అఖిల్ కి గాళ్స్ లో అద్భుత‌మైన క్రేజు ఉంద‌న‌డానికి ఆ యాంక‌ర‌మ్మల‌ పిచ్చి బిగ్ ఎగ్జాంపుల్.

తాజాగా ఓ యాంక‌ర‌మ్మ అఖిల్ పై త‌న క్ర‌ష్ ని బ‌య‌ట‌పెట్టేసింది. దేవుడు ప్ర‌త్య‌క్ష‌మై వ‌రం కోరుకోమంటే ఏం కోరుకుంటావ్‌? అని అడిగేస్తే .. త‌న చేతిపై ప‌చ్చ‌బొట్టును చూపించింది. మోచేతిపై అఖిల్ అని ప‌చ్చ‌బొట్టు పొడిపించుకుంది. ఇంత‌కీ ఎవ‌రీ యాంక‌ర్ అంటే .. పోరా పోవే షోతో పాపుల‌రైన విష్ణు ప్రియ‌.

`ల‌వ్ యు జింద‌గీ` అనే టీవీ షోకి యాంక‌ర్ ఝాన్సీ హోస్టింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే నాలుగైదు ఎపిసోడ్స్ పూర్త‌వ్వ‌గా నాలుగో ఎపిసోడ్ లో శ్రీ‌ముఖితో క‌లిసి విష్ణు ప్రియ సంద‌డి చేసింది. అఖిల్ అంటే విష్ణు ప్రియ‌కు పిచ్చి గ‌జ్జి అంటూ శ్రీ‌ముఖి అస‌లు ర‌హ‌స్యాన్ని రివీల్ చేసేయ‌గా.. త‌న చేతిపై ప‌చ్చ‌బొట్టును విష్ణు ప్రియ చూపించింది. అఖిల్ ని పెళ్లాడేందుకు నాగార్జున‌ను రెక్వ‌స్ట్ చేస్తానంటూ అమ్మ‌డు చాలానే హొయ‌లు పోయింది. అన్న‌ట్టు బిగ్ బాస్ ఇంటి స‌భ్యురాలిగా ఉన్న‌ప్పుడు తాను కూడా నాగార్జున గారికి అఖిల్ ని పెళ్లాడేస్తాన‌ని ప్ర‌పోజ‌ల్ పెట్టాల‌నుకున్నాన‌ని శ్రీ‌ముఖి కూడా ఓపెన్ అయిపోయింది.

మొత్తానికి ఈ ఎపిసోడ్ తో అఖిల్ పై యాంక‌ర్ల క్ర‌ష్ బ‌య‌ట‌ప‌డింద‌లా. ఇక అఖిల్ జీవీకే మ‌న‌వ‌రాలు శ్రీ‌యా భూపాల్ ని ప్రేమించిన సంగ‌తి తెలిసిందే. 2016లో ఈ జంట‌కు నిశ్చితార్థం జ‌రిగింది. కానీ మ‌న‌స్ఫ‌ర్థ‌ల‌తో విడిపోయారు. ఆ త‌ర్వాత అఖిల్ పూర్తిగా కెరీర్ పైనే దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే.