Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు కంగనాపై నోరు తెరుస్తున్న స్టార్స్
By: Tupaki Desk | 5 Sept 2020 6:00 AM ISTముంబయి పోలీసులపై కంగనా చేసిన విమర్శలకు శివసేన నాయకులు తీవ్రంగా స్పందించారు. నీకు ముంబయి పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబయిలో అడుగు పెట్టవద్దంటూ హెచ్చరించారు. ఎన్నో విపత్కర పరిస్థతుల్లో ముంబయి పోలీసులు ప్రాణాలు వదిలి మరీ ప్రజల ప్రాణాలు కాపాడారు. అలాంటి వారిని అవమానించిన నీకు ముంబయిలో చోటు లేదు అంటూ శివసేన నాయకులు విమర్శలు చేశారు. దాంతో కంగనా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. నన్ను అడుగు పెట్టవద్దు అనేందుకు ముంబయి ఏమైనా పీఓకే నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ముంబయిని కంగనా పీఓకే తో పోల్చినందుకు గాను ఆమెపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇన్ని రోజులు కంగనా ఎలాంటి విమర్శలు చేసినా కూడా బాలీవుడ్ వారు పట్టించుకోలేదు. బాలీవుడ్ లో 90 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారంటూ వ్యాఖ్యలు చేసినా కూడా స్పందించని బాలీవుడ్ స్టార్స్ ముంబయిని పీఓకే తో పోల్చడంతో హర్ట్ అయినట్లుగా కనిపిస్తున్నాయి. కంగనా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా 'ఐ లవ్ ముంబయి' క్యాంపెయిన్ ను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్యాంపెయిన్ ఎంతో మంది స్టార్స్ మరియు ప్రముఖులు పాలు పంచుకోబోతున్నారు. దాంతో కంగనాకు వారు అంతా కూడా కౌంటర్ ఇచ్చినట్లు అవ్వబోతుంది. అప్పుడు కంగనా ఒంటరి అవుతుందని భావిస్తున్నారు. మొదటి సారి కంగనా ముంబయిని పీఓకేతో పోల్చి ఇరుకున పడ్డట్లయ్యింది. ఈ ఫైర్ బ్రాండ్ ఆ వివాదం నుండి ఎలా బయట పడేనో చూడాలి.