Begin typing your search above and press return to search.

హాట్‌ లేడీ హైదరాబాద్‌ అనుబంధం

By:  Tupaki Desk   |   26 April 2019 2:02 PM GMT
హాట్‌ లేడీ హైదరాబాద్‌ అనుబంధం
X
సౌత్‌ నుండి వెళ్లి బాలీవుడ్‌ లో సెటిల్‌ అయిన అతి కొద్ది ముద్దుగుమ్మల్లో టబు ఒకరు. బాలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుని - ఇప్పటికి కూడా మంచి పాత్రలను దక్కించుకుంటూ టాప్‌ స్టార్‌ గా దూసుకు పోతున్న టబు హైదరాబాదీ అనే విషయం కొద్ది మందికి తెలియదు. తెలుగు సినిమాలతోనే ఇండస్ట్రీకి పరిచయం అయిన టబు ఆ తర్వాత బాలీవుడ్‌ కు వెళ్లింది. అక్కడ మంచి ఆఫర్లు రావడంతో అక్కడే సెటిల్‌ అయ్యింది. అడపా దడపా తెలుగులో సినిమాలు చేస్తూ ఉన్నా టబు బాలీవుడ్‌ కే పూర్తిగా పరిమితం అయ్యింది.

తాజాగా ఈమె హైదరాబాద్‌ లో నిర్వహించిన ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ కార్యక్రమంలో పాల్గొని లివింగ్‌ ఆన్‌ మై ఓన్‌ టర్మ్స్‌ అనే విషయమై ప్రశంగించింది. తాను పుట్టి పెరిగింది హైదరాబాద్‌ లోనే - నాకు హైదరాబాద్‌ లో చాలా చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ నగరంపై ఉన్న అభిమానంతో మొదట సినిమాలు కూడా వద్దనుకున్నాను. సినిమాలు చేస్తే హైదరాబాద్‌ వదిలేయాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో సినిమాలకు నో చెప్పాను. కాని ఇప్పుడు సినిమాల వల్లే ముంబయిలో ఉంటున్నాను.

తెలుగు సినిమాలతోనే నేను హీరోయిన్‌ గా పరిచయం అయ్యాను. ఆ సినిమా నాకు చాలా నేర్పింది. దర్శకుడు రాఘవేంద్ర రావు గారు నాకు గురువుతో సమానం. హైదరాబాద్‌ తో ఎప్పుడు కనెక్షన్‌ కలిగి ఉండాలని నేను కోరుకుంటాను. అందుకే తెలుగులో ఆఫర్‌ వస్తే తప్పకుండా చేసేందుకు ఆసక్తి చూపిస్తానంటూ టబు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ ల కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.