Begin typing your search above and press return to search.
బాలయ్య నిజాయితీకి హ్యాట్సాఫ్!!
By: Tupaki Desk | 29 Jun 2016 3:41 PM GMTబాలయ్య కారకు ప్రమాదం జరిగింది అనగానే.. చాలా పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా.. ''కారును స్వయంగా ఆయనే నడుపుతున్నారట'' అంటూ మొదట స్ర్కోలింగ్ వేశాయి. ఆ తరువాత ఆ లైన్ తీసేశాయి. కట్ చేస్తే.. ఇంకోటేదో కథ. అదంతా బాలయ్య మీద గౌరవంతో చేసిందా.. లేకపోతే బాలయ్య నడుపుతూ స్వయంగా యాక్సిడెంట్ చేశారంటే అభిమానులు ఏమన్నా ఫీలవుతారని చేసిందో ఎవ్వరికీ తెలియదు. కాకపోతే జనాల్లో మాత్రం కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఆ విషయం గురించి స్వయంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నిజాయితీగా ఏం జరిగిందో చెప్పారు.
తన కారుకు యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ తనకు ఏమీ అవ్వలేదని తెలుపుతూ.. తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తుండగా.. పూలమాల వచ్చి అద్దం మీద పడడంతో.. రోడ్డు సరిగా కనిపించక డివైడర్ ను గుద్దానని, కారు టైరు బ్లాస్ట్ అవ్వడం మినహా నష్టమేమీ జరగలేదని తెలిపారు. తండ్రి నందమూరి తారకరామారావు ఆశీస్సులు - తెలుగు ప్రజల ఆశీర్వాదాలు - అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్షగా తాను సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగానని బాలకృష్ణ పేర్కొన్నారు.
''స్వయంగా నేనే నడుపుతున్నా'' అంటూ ఒప్పుకునే దమ్ము ఎంత మంది పొలిటికల్ అండ్ ఇతర సెలబ్స్ కు ఉంది చెప్పండి? ఖచ్చితంగా ఈ విషయంలో బాలయ్య నిజాయితీకి హ్యాట్సాఫ్ చెప్పాలిందే.