Begin typing your search above and press return to search.
నాని అలా అంటాడని నేను అస్సలు ఊహించలేదు!
By: Tupaki Desk | 17 April 2022 12:30 AM GMTమొదటి నుంచి కూడా నాని కథాకథనాల పరంగా కొత్తదనం ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ఆయా సినిమాలలో పాత్రల పరంగా కొత్తదనం కనిపించేది .. కానీ ఆయన లుక్ లో పెద్దగా మార్పు ఉండేది కాదు. కాస్త క్రాఫ్ అటు పక్కకో .. ఇటు పక్కకో దువ్వడం, మీసం పైకో .. కిందికో అనడం చేసేవాడు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన సినిమా .. సినిమాకి తన లుక్ మార్చడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. 'శ్యామ్ సింగ రాయ్' నుంచి ఈ తీరు ఎక్కువగా కనిపిస్తోంది. ఆ సినిమాలో చాలా డీసెంట్ గా కనిపించిన నాని, 'అంటే .. సుందరానికీ' సినిమాలో అమాయకంగా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.
ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. 'మెంటల్ మదిలో' .. 'బ్రోచేవారెవరురా' తరువాత వివేక్ ఆత్రేయ చేసిన సినిమా ఇది. ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ .. 'అంటే .. సుందరానికీ' ముందుగా పెర్ఫెక్ట్ గా రెడీ చేసుకున్న కథ కాదు. అప్పటికప్పుడు ఆ లైన్ ను అనుకోవడం జరిగింది. ఫస్టాఫ్ వరకూ కథను అనుకుని, ఆ మాత్రం కథతోనే నానీగారిని కలిశాను.
ఈ కథ నానీ గారి జోనర్ లోనే ఉంటుంది .. కాకపోతే డిఫరెంట్ స్క్రిప్ట్. నానీగారు కథను చాలా శ్రద్ధగా విన్నారు. కథలో ఏ అంశం బాగుంటుందని నేను అనుకున్నానో .. ఆ అంశాలన్నిటికీ ఆయన రియాక్ట్ అయ్యారు.
అప్పుడు నాకు కాస్త నమ్మకం వచ్చింది. ఇది ఇలా చేయవచ్చుగదా .. అది అలా చేయవచ్చుగదా అని ఆయన ఏమీ చెప్పలేదు. 'సెకండాఫ్ ఎలా అనుకుంటున్నావు?' అని అడిగారు. 'ఇంకా ఏమీ అనుకోలేదు సార్ .. దానిపైనే వర్క్ చేస్తున్నాను' అన్నాను. త్వరలో మనిద్దరం కలిసి పని చేయబోతున్నాం అని చెప్పేసి ఆయన వెళ్లిపోయారు.
నానీ గారు ఆ మాట అనడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఫస్టు పార్టు వినగానే ఆయన ఆ మాట అంటాడని నేను ఎంతమాత్రం ఊహించలేదు. ఎలాగైనా ఈ స్క్రిప్ట్ ను వర్కౌట్ చేయాలనుకున్నాను. 15 .. 20 రోజులలోనే సెకండ్ పార్టును రెడీ చేయడం జరిగింది. కథను నానీగారు పూర్తిగా వినడం .. ఓకే చెప్పేయడం జరిగిపోయింది.
ఆ తరువాత 'హీరోయిన్ గా ఎవరిని అనుకుంటున్నావు?' అని నానీ గారు అడిగితే, నజ్రియా లాంటి అమ్మాయి అయితే బాగుంటుందని అన్నాను. 'నజ్రియా లాంటి అమ్మాయి ఎందుకు ? ఆమెనే ట్రై చేస్తే పోలా?' అని నాని అన్నారు. అలా ఆమె ఈ ప్రాజెక్టు లోకి వచ్చారు" అని చెప్పుకొచ్చాడు.