Begin typing your search above and press return to search.

చదువులేదని ఫీలవుతున్న స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   17 Dec 2016 3:30 PM GMT
చదువులేదని ఫీలవుతున్న స్టార్ హీరోయిన్
X
పింకీ.. పింకీ అని చాలామంది ముద్దుముద్దుగా పిలుస్తుంటారు కానీ.. అసలుసిసలు పింకీష్ లో మెరిసిపోయే ఆంటీగా బాలీవుడ్ భామ కరీనాకపూర్ గురించి చెప్పాల్సిందే. వయసు మీద పడుతున్నా.. తన అందంతో ఇప్పటి కుర్రాకారుకు సైతం మతి పోగొట్టే ఈ ఆంటీ త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వనున్నారు. ప్రెగ్నెంట్ అయిన నాటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఒక విషయం తననెంతగా ఫీలయ్యేలా చేస్తుందో చెప్పుకొచ్చారు. చిన్నతనం నుంచి చదువు మీద పెద్దగా దృష్టి పెట్టలేదని.. ఇరవైఏళ్ల వయసులోనే రెఫ్యూజీ సినిమాతో వచ్చేసిన ఆమె.. చదువును లైట్ తీసుకున్న విషయాన్ని చెప్పారు. చిన్నతనం నుంచి సినిమాల మీద ఇష్టంతో చదువు మీద పెద్దగా ఫోకస్ చేయలేదని.. స్కూల్ నుంచి నేరుగా తన అక్క కరిష్మా సినిమా షూటింగ్ లకు తాను వచ్చేసే విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు.

చదువును మధ్యలో వదిలేసినందుకు తాను విచారిస్తున్నానని.. తాను.. తనభర్త సైఫ్ ఆయన స్నేహితులు కలిసినప్పుడు సినిమాల్లో మునిగిపోయి ఇతర విషయాలు నిర్లక్ష్యం చేశామన్న భావనకు తాము గురవుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను ప్రయాణాలు చేయటానికి.. కొత్తవారిని కలవటానికి.. కొత్త విషయాలు అన్వేషించటానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయకపోతే ఇలాంటి బాధలు తప్పవని ఊరికే అనలేదేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/