Begin typing your search above and press return to search.
స్టార్ హీరోపై ఫిర్యాదు నమోదు
By: Tupaki Desk | 26 Sep 2019 3:25 PM GMTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ చిత్రం షూటింగ్ ఏపీలోని రాజమండ్రి సెంట్రల్ జైల్ లో జరుగుతోంది. పొలిటికల్ గా బిజీగా ఉంటున్న కారణంగా కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రం ఆలస్యం అయ్యింది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కమల్ హాసన్ కు గత కొన్ని రోజులుగా కేఈ జ్ఞానవెల్ రాజాతో 'ఉత్తమ విలన్' చిత్రం విషయమై వివాదం నడుస్తోంది.
ఇటీవల కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. ఉత్తమ విలన్ సమయంలో తన వద్ద 10 కోట్ల రూపాయలు తీసుకున్న కమల్ హాసన్ ఆ డబ్బు తిరిగి చెల్లించాలంటూ కోరుతుంటే మొహం చాటేస్తున్నాడు అంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. సినిమా విడుదలైన వెంటనే డబ్బు ఇవ్వడంతో పాటు తన బ్యానర్ లో ఒక సినిమాను చేసేందుకు కూడా ఆ సమయంలో ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు కమల్ హాసన్ మా బ్యానర్ లో నటించేందుకు డేట్లు ఇవ్వలేదు. పైగా మాకు చెల్లించాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.
2015లో 'ఉత్తమ విలన్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు చాలా ఏళ్ల క్రితమే ఆ సినిమా పూర్తి అయినా కూడా ఆర్థిక సమస్యల కారణంగా సినిమా విడుదల కాలేదు. ఆ సమయంలో కేఈ జ్ఞానవెల్ రాజా ఎంట్రీ ఇవ్వడంతో ఆ సినిమా విడుదలకు మార్గం సుగమం అయ్యింది. సినిమాకు జ్ఞానవెల్ రాజా సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ విషయమై నిర్మాతల మండలి పెద్దలు విచారణ జరిపి కమల్ హాసన్ తో మాట్లాడే అవకాశం ఉంది. కమల్ ప్రస్తుత పరిస్థితుల్లో 10 కోట్ల రూపాయలు రిటర్న్ చేయడం అంటే కష్టమే అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.