Begin typing your search above and press return to search.

వారిద్ద‌రి ప్రేమ‌కు అత‌డే కార‌ణ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   10 July 2018 7:33 AM GMT
వారిద్ద‌రి ప్రేమ‌కు అత‌డే కార‌ణ‌మ‌ట‌!
X
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లి అక్క‌డ త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శించ‌ట‌మే కాదు.. అక్క‌డి వారి మ‌నసుల్లో రిజిస్ట‌ర్ అయిన అతి కొద్ది మంది న‌టీమ‌ణుల్లో ప్రియాంక చోప్రా ఒక‌రు. సినిమా మీద సినిమా చూస్తున్న ప్రియాంక‌.. త‌న కంటే చిన్నోడైన అమెరిక‌న్ సింగ‌ర్ క‌మ్ న‌టుడు నిక్ జోనాస్ తో ప్రేమ‌లో ప‌డిపోవ‌టం తెలిసిందే.

ఎప్పుడు ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డ‌తారో తెలీన‌ట్లుగా.. అప్ప‌టికే ప‌లువురికి హ్యాండిచ్చిన ఘ‌న చ‌రిత్ర ఉన్న నిక్ ప్రేమ‌లో మునిగిపోయిన ప్రియాంక‌.. త‌న ప్రేమికుడ్ని త‌ల్లికి ప‌రిచ‌యం చేయ‌టానికి ముంబ‌యి తీసుకురావ‌టం తెలిసిందే. గ‌తంలో విదేశీ అబ్బాయిని త‌న కూతురుచేసుకుంటానంటే నో అనేస్తాన‌ని చెప్పిన ప్రియాంక త‌ల్లి.. నిక్ విష‌యంలో మాత్రం తొంద‌ర‌ప‌డ‌టం లేదు. కూతురి ఇష్టాన్ని కాద‌న‌లేకుండా ఉంద‌న్న విష‌యం తాజాగా ఆమెచేసిన ప్ర‌క‌ట‌న చెప్ప‌క‌నే చెప్పేసింది.

అత‌న్ని ఇప్పుడేగా క‌లిసింది.. అప్పుడు అభిప్రాయం ఎలా చెప్ప‌నంటూ ప్రియాంక త‌ల్లి మ‌ధుచోప్రా కుమార్తె ప్రేమ‌ను అంత త్వ‌ర‌గా జ‌డ్జిమెంట్ ఇవ్వ‌లేన‌న్న విష‌యాన్ని చెప్పేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ రోజు ప్రియాంక ఇంత హ్యాపీగా ఉండ‌టానికి.. త‌న ప్రియుడు నెక్ తో ఎంజాయ్ చేయ‌టానికి కార‌ణం తానేన‌ని చెప్పుకొచ్చారు ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు డ్వెయిన్ జాన్స‌న్‌.

తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ప్రియాంక ప్రేమ గురించిన ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు వారిద్ద‌రి ప్రేమ‌కు తానే కార‌ణ‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఆ క్రెడిట్ అంతా త‌న‌దేన‌ని.. బేవాచ్ మూవీలో ప్రియాంక‌తో క‌లిసి న‌టించాన‌ని.. జుమాంజి చిత్రంలో నిక్ తో క‌లిసి న‌టించాన‌ని.. వారిద్ద‌రికి కామ‌న్ ఫ్రెండ్ గా వారిద్ద‌రిని ప‌రిచ‌యం చేశాన‌ని.. అదే వారిప్పుడు సంతోషంగా ఉండ‌టానికి తానే కార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చారు. ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు ఓకే. రేపొద్దున తేడా వ‌చ్చి క‌టీఫ్ అయితే మాత్రం.. ఆ పాపం కూడా త‌న‌దేన‌న్న విష‌యాన్ని డ్వెయిన్ గుర్తుంచుకుంటే మంచిదేమో?