Begin typing your search above and press return to search.

ఖాళీగా ఇంట్లోనైనా కూర్చుంటా గానీ చెత్త పాత్ర‌లు చేయ‌ను!

By:  Tupaki Desk   |   3 Nov 2022 7:30 AM GMT
ఖాళీగా ఇంట్లోనైనా కూర్చుంటా గానీ చెత్త పాత్ర‌లు చేయ‌ను!
X
హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఫేమ‌స్ అవ్వాల‌న్న ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది. కానీ అమ్మ‌డి కెరీర్ రివ‌ర్స్ లో సాగుతోంది. ఆరంభంలో ఓ చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అటుపై వేగంగా స్టార్ హీరోల‌కు ప్ర‌మోట్ అయింది. బ‌న్నీ..ప‌వ‌న్..గోపీచంద్..నాగ‌చైత‌న్య లాంటి హీరోల‌తో క‌లిసి ప‌నిచేసింది. కానీ అవేవి అనుకి క‌లిసిరాలేదు.

క‌మ‌ర్శియ‌ల్ గా ఆ సినిమాలు స క్సెస్ కాక‌పోవ‌డంతో రేసులో వెనుక‌బ‌డింది. ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా డౌన్ ఫాల్ మొద‌లైంది. తెలుగులో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో కోలీవుడ్ వైపు చూసింది. కానీ టాలీవుడ్ అంత ఆద‌ర‌ణకు అక్క‌డ నో చుకోలేదు. దీంతో బ్యాక్ టూ పె విలియ‌న్ త‌ప్ప‌లేదు. దీంతో సొగ‌సిరికి అనుభ‌వం చాలా గుణ‌పాఠ‌లే నేర్పింద‌ని తాజాగా అమ్మ‌డి మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

'ఊర్వ‌శివో రాక్షసివో' సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా వైఫ‌ల్యాల్ని గుర్తు చేసుకుని మ‌ళ్లీ వాటి జోలికి వెళ్ల‌ను అంటూ చెప్పుకొచ్చింది. 'సినిమా రంగంలోకి చాలా మార్పులొచ్చాయి. హీరో ఎవ‌రు? అనే విష‌యాన్ని ప్రేక్ష‌కులు మర్చిపోతున్నారు. క‌థ ఎలా ఉంద‌ని విశ్లేషించే స్థాయికి ఎదిగారు. క‌థ బాగుంటే ఎవ‌రు న‌టించిన ప‌ట్టించుకోవ‌డం లేదు.

కొన్ని సినిమాల ఫలితాలు చూశాక నేను క‌థ‌ల ఎంపిక‌లో పద్ద‌తి మార్చుకున్నా. మూస క‌థ‌ల‌కి దూరంగా ఉంటున్నా. నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చిన పాత్ర‌కి నేను స‌రిపోతానా? లేదా? అని ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకుని..విశ్లేషించుకుని ఒప్పుకుంటున్నా. నాకు త‌గ్గ పాత్ర కాద‌ని అనిపిస్తే వాటి జోలికి వెళ్ల‌డం లేదు. ఎంత పారితోషికం ఆఫ‌ర్ చేసినా నో చెప్పేస్తున్నా.

ఏదో ఒక‌టి చేద్దాం అనే ఆలోచ‌న నుంచి బ‌య‌ట ప‌డ్డా. చెత్త పాత్ర‌లు ..సినిమాలు చేయ‌కూడ‌ద‌ని మాత్రం చాలా బ‌లంగా డిసైడ్ అయ్యా. అలాంటి సినిమాలు చేయ‌డం క‌న్నా ఇంట్లో ఖాళీగా కూర్చోవ‌డం ఉత్త‌మం. ఊర్శ‌శివో రాక్ష‌సివో సినిమా చేయ‌డానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంది. ఇందులో సిందు పాత్ర నా వ్య‌క్తిగ‌త జీవితానికి చాలా ద‌గ్గ‌ర ఉంటుంది.

అలా పాత్ర‌కి నేను బాగా క‌నెక్ట్ అయ్యా. అందుకే సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నా. నిర్మాత అల్లు అర‌వింద్ సార్ మాట‌లు కూడా న‌న్ను ఎంత‌గానో ప్రేరేపించాయి' అని చెప్పుకొచ్చింది. ఇంకా అమ్మ‌డి చేతిలో మ‌రో ప్రాజెక్ట్ ఉంది. అదే రావ‌ణ‌సూర‌. అలాగే ఓటీటీలోనూ కొన్ని ప్రాజెక్స్ట్ చేస్తున్న‌ట్లు తెలిపింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.