Begin typing your search above and press return to search.
కోపం వచ్చింది.. కంపెనీ పెట్టాడు
By: Tupaki Desk | 13 July 2017 4:21 AM GMTతెలుగులోనూ తమిళ్ లోనూ మంచి హీరోగా ప్రొడ్యూసర్ గా ఉంటూ ఇప్పుడు తమిళ్ సినిమా నడిగర్ సంఘం కు ప్రధాన కార్యదర్శి ఎన్నుకోబడ్డాడు విశాల్. తమిళ్ సినిమాకు ఏం జరిగినా ముందు కోపం వచ్చేది మన తెలుగు వాడైన విశాల్ రెడ్డికే. పి వి ప్రశాంత్ డైరెక్ట్ చేసిన ‘కధాలీల్ విజున్ధెన్’ సినిమాలో ‘నాకా మూకా’ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ డైరెక్టర్ ‘శకుంతలవీన్ కధాలన్’ అనే సినిమా తో నటుడుగా మారబోతున్నాడు. . ఈ సినిమాకు పి వి ప్రశాంత్ నటుడు గా చేస్తూ కథ, స్క్రీన్ ప్లే, మాటలు కొన్ని పాటలు కూడా రాశాడు. ‘శకుంతలవీన్ కధాలన్’ సినిమాకు సంగీతం కూడా పి వి ప్రశాంత్ నే అందించాడు. అయితే ఈ సినిమా ఆడియో రైట్స్ ని హీరో విశాల్ తీసుకున్నాడు
‘వి మ్యూజిక్’ అనే ఆడియో లేబల్ ద్వారా ఈ సినిమా ఆడియోను విడుదల చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ గా ఉన్న విశాల్ ఇప్పుడు ఎందుకు ఆడియో బిజినెస్ లోకి వస్తున్నాడో అక్కడ వారికి అంతుపట్టలేదు. ఇదే మాట విశాల్ ని అడిగితే “నా సినిమాలలో ఏదో ఒక పాట తప్పకుండా జనాలకు నచ్చేదిగా ఎక్కువ కాలం వినేదిగా ఉంటుంది. ఉదాహరణకు ‘పాండ్యనాడు’ సినిమాలో ‘ఫై ఫై ఫై’ పాట గొప్ప జనాదరణ పొందిన పాటలో ఒకటి. నాకు ఆ పాట వలన వచ్చిన లాభాలు ఏమి అందలేదు. నేను అదే మాట వాళ్ళని అడిగితే మ్యూజిక్ మార్కెట్ ఏమి అంతగా బాగాలేదు లాభాలు ఏమి రాలేదు అని చెప్పారు. అందుకే నేను ఈ ‘వి మ్యూజిక్’ ని మొదలుపెట్టాను. ఈ లేబల్ ద్వారా ఈ సినిమా మ్యూజిక్ విడుదల చేస్తాము దీనిలో వచ్చే లాభాలు కూడా ప్రశాంత్ కి చేరేలాగా నియమాలు పెట్టుకున్నాం'' అని చెప్పాడు.
ఇది ఇలా ఉంటే మరో పక్క గవర్నమెంట్ విధించిన కొత్త పన్ను విధానం పై ధర్నా చేస్తున్న థియేటర్లు ఓనర్లకు మద్దతుగా నిలుస్తున్నాడు విశాల్. గవర్నమెంట్ కు కూడా ఒక విన్నపం తెలియజేసాము ఎంటర్టైన్మెంట్ టాక్స్ తగ్గించమని చెప్పాడు. వాళ్ళ నుండి సానుకూల స్పందన వస్తుంది అనే ఆశతో ఉన్నాం అని చెప్పాడు. సినిమాకు వచ్చే వాడు ఎంజాయ్ చేసే విదంగా ఉండాలి కానీ రావడానికి భయపడేటట్లు రేట్లు ఉండకూడదు అంటున్నాడు విశాల్. తన సినిమాల కోసం ప్రొడ్యూసర్ అయ్యాడు సినిమా వాళ్ళ గొడవలు వలన ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఎవరి మీదో కోపం తెచ్చుకొని మ్యూజిక్ కంపెనీ కూడా మొదలుపెట్టేశాడు. మనోడంతే.. అదోరకం!!