Begin typing your search above and press return to search.
బాలకృష్ణ 'మా' ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది: మంచు విష్ణు
By: Tupaki Desk | 22 July 2021 2:30 PM GMTటాలీవుడ్ లో ప్రస్తుతం 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఆర్టిస్టుల బాగోగుల కోసం ఏర్పాటైన 'మా' కు ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. 2019లో ఎన్నికైన పాలక వర్గం పదవీకాలం సెప్టెంబర్ లో ముగియనుంది. అయితే దానికి ఇంకా చాలా సమయం ఉండగా.. అధ్యక్ష పదవి బరిలో ఉండే సభ్యులు అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. ఈసారి మంచు విష్ణు - ప్రకాశ్ రాజ్ - జీవితా రాజశేఖర్ - హేమ - సివిఎల్ నరసింహారావు ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ను కూడా ప్రకటించారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ పెద్దలు 'మా' ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఓ వీడియోని విడుదల చేస్తూ 'మా' ఎన్నికలపై తన అభిప్రాయం తెలియజేశారు. 'మా' బిల్డింగ్ ను కట్టేందుకు డబ్బులు ఇస్తానని చెప్పిన మంచు విష్ణు.. ఒకవేళ పెద్దలంతా కలిసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని నిర్ణయిస్తే తప్పుకుంటానని ప్రకటించారు. మంచు విష్ణుకు మద్దతిచ్చిన నందమూరి బాలకృష్ణ.. 'మా' భవన నిర్మాణంలో అతడికి సహాయం చేస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలయ్య తనకు బ్రదర్ లాంటి వారని.. తనకు మద్దతిచ్చినందుకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.
''ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు నన్ను పోటీ చేయమన్నారు. వాళ్లు చెప్పినప్పుడు రేస్ లో ఎవరూ లేరు. పెద్దల కోరిక మేరకు 100 పర్సంట్ 'మా' ఎలక్షన్స్ లో పోటీ చేస్తాను. అయితే సినీ పెద్దలంతా కలిసి ఎవరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా నాకు అభ్యంతరం లేదు. 'మా'లో మునిగిపోయే కష్టాలేమీ లేవు. సందర్భం వచ్చిన ప్రతిసారి అందరూ సొంత భవనం అంటూ మాట్లాడుతున్నారు. అందుకే 'మా' భవనం పూర్తిగా నేనే నిర్మిస్తానని చెప్పాను'' అని మంచు విష్ణు అన్నారు.
''బాలకృష్ణ గారు 'మా' ప్రెసిడెంట్ అవ్వాలని నాకు కోరికగా ఉంది. ఆయన అయితే మామూలుగా ఉండదు. ఆ దిశగా ఆలోచిస్తే బాగుండు. ఆయన ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం. ఆయనే కాదు.. ఆయన జనరేషన్ లో కొందరు ప్రెసిడెంట్ అవలేదు. వారిలో ఎవరైనా అయితే చూడాలని ఉంది. కాకపోతే 'మా' కోసం వాళ్ళు టైం కేటాయించగలరా అనేది డౌట్. అందుకే వాళ్ళు అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ఆగుతున్నారేమో' అని మంచు విష్ణు మాట్లాడారు.