Begin typing your search above and press return to search.
అత్తపై ప్రేమతో కరోనా కోరల్లో చిక్కిన సన్నీ!
By: Tupaki Desk | 5 Jun 2020 5:01 AM GMTఅత్తను ప్రేమించే కోడలు.. అత్తను గౌరవించే కోడలు .. ఈరోజుల్లో ఎక్కడ? ఒక వేళ ఉంటే దేవత! అని పొగిడేయొచ్చు. అయితే కరోనా కాటేస్తున్న ఇలాంటి వేళ ఎవరైనా ఆ కోరల్లో చిక్కుకునేందుకు వెతుక్కుంటూ వెళతారా? అది కూడా అత్త కోసం!! కానీ బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ అంత పనీ చేసింది. ఓవైపు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతోంది. అక్కడ నిత్యం వేలాది మంది వైరస్ బారిన పడుతూ ఉంటే వందలాది మంది మరణిస్తున్నారు. 20లక్షల కొవిడ్ కేసులు ఒక్క అమెరికాలోనే నమోదై 2లక్షల చావులు చూడాల్సొచ్చింది. ఒక రకంగా అమెరికా ఏమైపోతోందోనన్న భయాందోళన వ్యక్తమవుతోంది.
అప్పటికి ముంబైలో కేవలం పదుల సంఖ్యలోనే కొవిడ్ 19 కేసులు నమోదవుతున్నాయి. అలాంటి సమయంలో వయసు మళ్లిన తన అత్తను సాకేందుకు ముంబై వదిలి అమెరికా వెళ్లింది సన్నీలియోన్. భర్త డేనియల్ కుటుంబం అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఆ కుటుంబం కోసం తాను ఇంత త్యాగం చేసింది. భర్త డేనియల్ పిల్లలతో కలిసి సన్నీ ముంబై నుంచి అమెరికా వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో సమయం గడిపడమే గాక.. అభిమానంగా అత్తకు సేవలందించింది.
అంతేనా.. ఈ ఏజ్ లో తనకు ఎవరున్నారు? అత్తను బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది! అంటూ సన్నీ చెప్పిన మాట.. నిజంగానే ఇండియాలోని చాలామంది కోడళ్లకు జ్ఞానోదయం కలిగించేదేనన్న ముచ్చటా వినిపిస్తోంది. ఈరోజుల్లో అత్త మామల బాగు కోసం ఆలోచించే కోడలా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు కొందరైతే.
ముంబై వదిలి అమెరికా వెళ్లడం బాధ కలిగించేదే అయినా అత్తమ్మ వయసును దృష్టిలో పెట్టుకుని అన్నీ ఆలోచించి అక్కడికి వెళ్లాను అని సన్నీ చెబుతోంది. కరోనా వీరవిహారంలో వయసు మళ్లిన అత్తను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదేనని చెప్పి స్ఫూర్తి నింపింది. అంతర్జాతీయంగా విమాన సర్వీసుల పునరుద్ధరణ జరిగాక తిరిగి ముంబైకి వచ్చేస్తానని సన్నీ తెలిపింది.