Begin typing your search above and press return to search.
పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేయాలని అనుకున్నా
By: Tupaki Desk | 15 May 2019 7:19 AM GMTఒకప్పుడు టాలెంట్ ఉన్నవాళ్లకే కేంద్రంలోని భారత ప్రభుత్వ పద్మ అవార్డులను ప్రకటించేది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక తమకు అనుకూలురైన ప్రముఖులకు ఇవ్వడం మొదలెట్టేసిందన్న విమర్శ ఉంది. ఆ కోవలోనే పద్మ శ్రీ అవార్డును అందుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ అన్న కామెంట్స్ నెట్ లో వ్యక్తమయ్యాయి.. పద్మ అవార్డ్ తనకు వస్తుందని అనుకోలేదని.. తాను అర్హుడినా కాదా అని కూడా డౌట్ వచ్చిందని తాజాగా సైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
తాజాగా అర్భాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా ప్రఖ్యాత హిందీ చానెల్ లో ప్రసారమయ్యే ‘పించ్ షో’లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలోనే తాను ‘పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేయాలని అనుకున్నానని’ సంచలన కామెంట్స్ ను చేశాడు. పరిశ్రమలో నాకన్న ఎంతో ప్రతిభ ఉన్న సీనియర్ నటులు ఎందరో ఉన్నారని.. వారికి దక్కని పద్మశ్రీ నాకు రావడం కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యాననని సైఫ్ చెప్పుకొచ్చాడు. ఈ అవార్డ్ ను తీసుకోవాలని అనిపించలేదని.. అయితే భారత ప్రభుత్వం నిర్ణయాన్ని తిరస్కరించకూడదని మా నాన్న చెప్పడంతో తీసుకున్నానని వివరించారు.
అయితే తనకు పద్మ శ్రీ అవార్డ్ రావడం పై నెటిజన్లు ఓ రేంజ్ లో తిట్టిపోశారని సైఫ్ చెప్పుకొచ్చాడు. తైమూర్ తండ్రి పద్మ శ్రీ కొనుక్కున్నారని కొందరు.. రెస్టారెంట్ లో కొంతమందిని కొట్టిన ఇతడికి నటన రాదని.. అసలు నవాజ్ అని బిరుదు సూట్ కాదని.. పద్మశ్రీకి అనర్హుడని తిట్టిపోశారని సైఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అనర్హుడిని అయినా భవిష్యత్ లో మరింత ఉత్తమ ప్రతిభ కనబర్చడానికి ప్రయత్నిస్తానని.. పద్మశ్రీకి అర్హుడిగా మారుతానని సైఫ్ చెప్పుకొచ్చాడు.