Begin typing your search above and press return to search.
నన్ను నిందించారు.. వేధించారు.. ఇప్పుడు ఉమెన్స్ డే గ్రీటింగ్స్ చెబుతున్నారాః సునీత
By: Tupaki Desk | 8 March 2021 5:30 PM GMTరెండో పెళ్లి తర్వాత సింగర్ సునీత ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నదో.. ఎంతగా ట్రోలింగ్ కు గురైందో అందరికీ తెలిసిందే. వాటిపై ఇప్పటి వరకూ నోరు విప్పని సునీత.. తాజాగా మహిళా దినోత్సవం వేళ స్పందించారు. తనపై రాళ్లు విసిరిన వారికి పేరు పేరునా తగిలేలా మాట్లాడారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు సునీత. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతోంది. ఇంతకీ సునీత ఏం రాసిందంటే..
''నా జీవితాన్ని మీరే నిర్ణయిస్తారు. ట్రోల్ చేస్తారు. నన్ను ప్రతిసారీ కిందకు లాగుతుంటారు. నాలో అభద్రతాభావాన్ని నెలకొల్పుతుంటారు. ఏదో ఒక విషయంలో నన్ను తప్పని నిరూపించాలని ప్రయత్నిస్తారు. మీరు ఎప్పుడూ నన్ను నమ్మరు.. నాకు అండగా నిలవరు.. ఆఖరికి నేను చెప్పేది కూడా వినరు. నేను ఓడిపోయినప్పుడు మాత్రం నన్ను చూసి నవ్వుతుంటారు. ఇబ్బంది పెడుతుంటారు. ఎలాంటి కారణం లేకుండా నన్ను నిందించిన మీరే ఇప్పుడు నాకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారా?'' అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఇంకా కొనసాగించారు.
''నేను మీ శుభాకాంక్షలు స్వీకరిస్తున్నాను. ఎందుకంటే.. మీరు నాపై విసిరిన రాళ్లనే పునాదులుగా మార్చుకుని నా బలాన్ని మరింత పెంచుకుని జీవితంలో ముందుకు సాగుతున్నాను. చిరు నవ్వుతో అన్నింటినీ క్షమించాను. ప్రేమను పంచాను. ఎందుకంటే నేను ఒక స్త్రీని.. అన్నింటినీ సహించాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'' అని ముగించారు సునీత.
ఒక మహిళగా తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానో ఒక పోస్టు ద్వారా మొత్తం వివరించారు సునీత. తనను పలు విధాలుగా విమర్శించిన వారందరికీ టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా పోస్టుతో సమాధానం చెప్పారు.