Begin typing your search above and press return to search.

గాయం కోసం చాలా వెయిట్ చేసిందట

By:  Tupaki Desk   |   24 Nov 2017 11:30 PM GMT
గాయం కోసం చాలా వెయిట్ చేసిందట
X
బాలీవుడ్ బాక్స్ ఆఫీసు క్వీన్ గా పిలవబడే డేర్ హీరోయిన్.. కంగాన రనౌత్. తన సినిమాల్లో హీరోలు లేకున్నా ఎన్నో బాక్స్ ఆఫీసు హిట్స్ ను అందుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన క్వీన్ చిత్రం దాదాపు రూ.100 కోట్లను దాటింది. అయితే కంగాన ఆ స్థాయిలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి మొదట్లో ఎన్నో ఇబ్బందులను పడింది. అలాగే ఎన్నో అవరోధాలను విమర్శలను కూడా ఆమె జీవితంలో ఎదుర్కొంది.

ఆమె ఒక సినిమాను ఒకే చేసింది అంటే చాలు ఆ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తుంది. ఇక అప్పుడప్పుడు షూటింగ్స్ లలో కొన్ని గాయాలను కూడా ఫేస్ చేస్తుంటోంది. ఇక అసలు విషయానికి వస్తే అమ్మడు రీసెంట్ గా మరోసారి ‘మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే మొదటి సారి కత్తి గాయాన్ని చూసిన కాంగాన రీసెంట్ గా కాలు బెనకడంతో రెస్ట్ తీసుకునేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ ఘటనపై కంగాన ఎవరు ఊహించని విధంగా స్పందించింది. తనకు ఎప్పుడెప్పుడు గాయం అవుతుందా అని చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నానని చెప్పింది.

''గత 60 రోజుల నుండి షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నా.. ఒక్క గాయం అయితే ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోవచ్చని అనుకున్నా ఇప్పుడు రెస్ట్ దొరికింది'' అని వివరించింది. కానీ కంగనా మొదటి గాయం అయినపుడు మాత్రం వేరేవిధంగా స్పందించింది. ఝాన్సీ లక్ష్మీబాయ్ కోసం ఎంత పెద్ద గాయమైన భరిస్తాను అని చెప్పిన కంగన ఇప్పుడు ఇలా స్పందించడం కొంచెం విడ్డురంగానే ఉంది.