Begin typing your search above and press return to search.
అతడు మోసం చేశాడు.. ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతుంది
By: Tupaki Desk | 3 Feb 2020 11:15 AM ISTనటుడు దర్శన్.. హీరోయిన్ సనంశెట్టి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమ ఆ మద్య తమిళ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరు కలిసి ఒక సినిమాలో హీరో హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా షూటింగ్ సందర్బంగా వీరి మద్య ప్రేమ పుట్టడం.. అది పెరిగి పెద్దదయ్యి వివాహంకు దారి తీయడం జరిగింది. వీరి వివాహానికి గత ఏడాది మే లో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు ఒప్పుకుని వీరి వివాహంకు ఏర్పాట్లు చేశారు.
పెళ్లి జూన్ లో జరగాల్సి ఉంది. అయితే దర్శన్ కు బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో పెళ్లిని వాయిదా వేయడం జరిగిందట. దర్శన్ బిగ్ బాస్ సీజన్ 3 లో ఉన్న సమయంలో సనం శెట్టి అతడిని ప్రమోట్ చేసేందుకు దాదాపుగా 15 లక్షలు ఖర్చు పెట్టిందట. దర్శన్ బయటకు వచ్చిన తర్వాత సనం శెట్టితో దూరంగా ఉంటూ పెళ్లి విషయం ఎత్తితే మౌనంగా ఉంటున్నాడట. చివరకు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుందాం అంటూ ప్రపోజల్ పెట్టాడట.
ఇదే విషయమై దర్శన్ తల్లిదండ్రులను ప్రశ్నిస్తే అప్పుడు నువ్వు నచ్చావు.. ఇప్పుడు అతడికి నువ్వు ఇష్టం లేదు అంటున్నారట. దాంతో సనం శెట్టి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దర్శన్ వల్ల తాను చాలా నష్టపోయాను అంటూ పోలీసుల వద్ద వాపోయిందట. దర్శన్ కోసం తాను చాలా ఖర్చు పెట్టాను. అతడు నన్ను మోసం చేశాడంటూ చీటింగ్ కేసును దర్శన్ పై పోలీసు స్టేషన్ లో పెట్టింది. ఇదే సమయంలో దర్శన్ మీడియాతో మాట్లాడుతూ నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో మరి ఆ తర్వాత కూడా ఆమె తన పాత ప్రియుడితో కలిసి రాత్రంతా గడిపింది.. బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతుందంటూ ఆరోపించాడు. ఈ విషయ మై ప్రస్తుతం రచ్చ జరుగుతుంది. వీరిద్దరు ఇంతటి గొడల్లో కలిసి ఉండటం అసాధ్యం. ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంటే మంచిదంటూ కొందరు సలహా ఇస్తున్నారు. మరి వీరు చివరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.