Begin typing your search above and press return to search.
ఎన్నో అవమానాలను అనుభవించి రాటుదేలిపోయాను: సీనియర్ నటి
By: Tupaki Desk | 21 April 2021 12:30 AM GMTతెలుగులో కేరక్టర్ ఆర్టిస్టుగా మంచిపేరు తెచ్చుకున్నవారిలో 'డబ్బింగ్ జానకి' ఒకరుగా కనిపిస్తారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆమె ఎక్కువగా పాపులర్ కావడం వలన అంతా ఆమెను డబ్బింగ్ జానకిగా పిలుస్తూ ఉంటారు. ఆమె నటనలోని సహజత్వానికి కొలమానంగా, 'సాగర సంగమం' సినిమాలోని కమలహాసన్ తల్లిపాత్రను చెప్పుకోవచ్చు. అలాంటి ఆమె తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నటి కృష్ణవేణితో కలిసి పాల్గొన్నారు. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ఆమె ప్రస్తావించారు.
"నా అసలు పేరు దాసరి జానకి .. కానీ డబ్బింగ్ జానకి అంటేనే ఆందరికీ తెలుస్తుంది. 'షావుకారు' జానకి .. సింగర్ జానకి .. నేను .. ఇండస్ట్రీలో ముగ్గురం ఉన్నాం. అందువలన వెంటనే గుర్తుకు రావడం కోసం నా పేరుకు ముందు డబ్బింగ్ తగిలించేశారు. అలా పిలవడం నాకు మైనస్ కాలేదు .. ప్లస్సే అయింది. నేను చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పినప్పటికీ .. నాకు ఫుడ్డు పెట్టింది యాక్టింగ్ అనే చెప్పాలి. నేను నాటకాల నుంచి వచ్చాను .. అందువలన నాకు నాటకాలంటేనే ఎక్కువ ఇష్టం. ఇంతవరకూ నేను వెయ్యి సినిమాలకి పైనే చేసి ఉంటాను.
ఎందుకు ఈ సినిమాను నేను ఒప్పుకున్నాను .. ఒప్పుకోకుండా ఉంటే బాగుండేదని బాధపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంతమంది ఆర్టిస్టులను పై స్థాయిలో కూర్చోబెట్టి .. మిగతా వాళ్లను చిన్నచూపు చూస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అలాంటి సంఘటనలు నా కెరియర్లో చాలానే ఉన్నాయి. షూటింగుల పరంగా తెల్లారేసరికి పరిస్థితులు మారిపోవడం చూశాను. నేను అందరితోనూ సరదాగానే ఉండేదానిని. ఎవరైనా చులకనగా చూస్తే మాత్రం చాలా బాధపడతాను. అలాగని ఎవరితోను గొడవలు పడేదానిని కాదు. అవమానాలు అనుభవించి అనుభవించి ఇప్పుడు రాటుదేలిపోయాను" అని చెప్పుకొచ్చారు.