Begin typing your search above and press return to search.

నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా!: వర్మ

By:  Tupaki Desk   |   11 May 2022 11:30 PM GMT
నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా!: వర్మ
X
రామ్ గోపాల్ వర్మ తీరు వేరు .. ఆయన దారి వేరు. ప్రతి విషయంలోను ఆయన ఆలోచనా విధానం భిన్నంగానే ఉంటుంది. విషయం ఏదైనా తడుముకోకుండా తన అభిప్రాయాన్ని ముక్కు సూటిగా చెప్పేయడం ఆయనకి అలవాటు. అలాంటి వర్మ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. "శివ .. క్షణ క్షణం .. రంగీలా .. అంతం సినిమాలు తీసిన వర్మ చచ్చిపోయాడు. ప్రతి సినిమా తరువాత నేను చచ్చిపోతాను .. అంటే మారిపోతాను. ఒకసారి చేసేసిన తరువాత ఆ ఫేజ్ నాకు బోర్ కొట్టేస్తుంది.

నా మెంటల్ కండిషన్ అంతే .. చిన్నప్పుడు మా మదర్ ఒళ్లో నుంచి జారీ పడిపోవడం వలన తలకి బాగా దెబ్బ తగిలింది .. అప్పటి నుంచి ఇలా అయిపోయాను. సినిమా తీయడం అనేది నా ఇష్టం .. జనాలు థియేటర్ కి వస్తారా లేదా అనేది వాళ్ల ఇష్టం.

నాతో సినిమాలు చేయడానికి బయట నిర్మాతలు భయపడుతున్నారనీ .. నా సినిమాలకి నేనే నిర్మాతనని మీరు అంటే నేనేం చెప్పను? ఇలాంటి రొటీన్ ప్రశ్నలకి సమాధనం చెప్పి చెప్పి నాకు బోర్ కొట్టేసింది. ఫైనాన్షియల్ గా వర్మ సూపరా? అని అడుగుతున్నారు.

నేను పొద్దున నిద్ర లేచి .. రాత్రి పడుకునేంతరవరకూ ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతాను. ఇంతవరకూ అలా చేస్తూనే వచ్చాను .. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? నా సినిమా రిలీజ్ అయిన తరువాత అది హిట్ అయినా .. ఫ్లాప్ అయినా పట్టించుకోను.

ఆ తరువాత చేయవలసిన సినిమాను గురించే నేను ఆలోచిస్తూ ఉంటాను .. అందుకు సంధించిన పనుల్లోనే ఉంటాను. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు .. నా హక్కులపై నాకు అవగాహన ఉంది. అందువలన వేరే వాళ్లలా నేను భయపడను అంతే. వాక్ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకోవడానికీ .. వినియోగించుకోవడానికి తేడా ఉంది.

నేను ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా ఎవరినీ ఏమీ అనను. కొన్ని విషయాలపై నేను స్పందిస్తాను. మనం ఏది మాట్లాడినా ఎవరికో ఒకరికి ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఎవరికో బాధ కలుగుతుందని అనుకుంటే అందరూ నోరు మూసుకుని కూర్చోవలసి ఉంటుంది. నా గురించి ఎవరేమనుకుంటున్నారనేది నేను పట్టించుకోను. అలాంటివాళ్లకి నేను చెప్పేది కూడా ఏమీ లేదు. గత 20 ఏళ్లుగా నేను చెబుతున్నది ఒక్కటే .. నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతుకుతా .. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చావండి .. ఇదే నా మెసేజ్ "అంటూ చెప్పుకొచ్చారు.