Begin typing your search above and press return to search.
మంత్రసాని తనం తీసుకున్నప్పుడు ఫినిష్ అయ్యే వరకు ఉండాలి.. నాగబాబు పై కళ్యాణ్ కామెంట్స్!
By: Tupaki Desk | 29 Jun 2021 2:38 PM GMTటాలీవుడ్ లో త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల కోసం ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు - జీవిత రాజశేఖర్ - హేమ - సీవీఎల్ నరసింహారావు లు 'మా' అధ్యక్ష పదవి కోసం బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ప్యానల్ పదవీకాలం ముగియకముందే తన ప్యానల్ అంటూ ప్రకాశ్ రాజ్ 27 మందితో మీడియా ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో లోకల్ - నాన్ లోకల్ అంటూ కామెంట్లు చేస్తూ.. ఎవరి వ్యూహాల్లో వారున్నారు. తాజాగా నటుడు నిర్మాత ఓ.కళ్యాణ్ కూడా 'మా' అధ్యక్ష బరిలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి తాను పోటీ చేయడం లేదని, ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చారు.
కళ్యాణ్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా 'మా' ఎన్నికలు.. బిల్డింగ్ కట్టిస్తామనే ప్రామిస్ మీదే జరుగుతున్నాయి. కానీ బిల్డింగ్ ఎక్కడ ఉంది?. అప్పటి ప్రభుత్వాలు పద్మాలయ స్టూడియో వెనుక 1000 గజాల స్థలాన్ని ఎందుకు తీసుకోలేకపోయారు? ఫ్రీగా వచ్చిన వెయ్యి గజాల స్థలాన్ని నెగ్లెజెన్సీతో పోగొట్టారు. అయినా ఇంతమంది స్టార్ హీరోలు యంగ్ హీరోలు ఉన్న మన ఇండస్ట్రీ వెయ్యి గజాల స్థలం కొనుక్కోలేమా? అని ఎవరైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ గత 20 ఏళ్లలో ఏ జనరల్ బాడీ మీటింగ్ కు రాలేదు. అయిన బిజీ ఆర్టిస్ట్ కాబట్టి రాలేదు అనుకుందాం. కానీ ఎన్నికల ప్రకటన రాకుండానే ప్రస్తుతం ఉన్న ప్యానల్ లోని సభ్యులతో ప్రకాశ్ రాజ్ నా ప్యానల్ అని మీడియా ముందుకు రావడం ఏంటి? అని కళ్యాణ్ ప్రశ్నించారు.
''ప్రతి ఎన్నికలప్పుడు ఒక పెద్ద మనిషి వస్తారు. సపోజ్ నాగబాబుని తీసుకుందాం. ఆయనకు నేను బాగా రెస్పెక్ట్ ఇస్తాను. ఆయన్ను బాబు అని పిలుస్తాను. ఆయన రాజేంద్రప్రసాద్ ని గెలిపిద్దాం.. శివాజీరాజా ని గెలిపిద్దాం అని మైక్ ముందుకు వస్తారు. భాధ్యత తీసుకొని గెలిపించినప్పుడు.. సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేయాలి. మంత్రసాని తనం తీసుకున్నప్పుడు ఫినిష్ అయ్యే వరకు ఉండాలి. గెలిపించిన తర్వాత ఇంట్లో కూర్చోవడం ఏంటి? గెలిపించే సత్తా ఉన్నప్పుడు అందరినీ కూర్చో బెట్టి సమస్యలను పరిష్కరించలేరా?. ఇప్పుడు ప్రకాష్ రాజ్ నా ప్యానల్.. ఇది చేస్తా అది చేస్తా అంటూ వచ్చాడు. మేము ఎలా నమ్మాలి?. మూడు నాలుగు సార్లు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ కొట్టుకుంటారు. ఇంట్లో కూర్చుంటారు. ఇదేనా 'మా' కి కావాల్సింది'' అని కళ్యాణ్ అన్నారు.
చిరంజీవి - మోహన్ బాబు - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేశ్ వంటి పెద్దవారంతా వెనుక కాదు మేము ముందున్నాం అంటూ రావాలి. 'మా' వ్యవహారాల్లో కలగజేసుకుని ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలి.. ఎన్నికలు అవసరం లేదని.. ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో వారే నిర్ణయించాలి. స్టార్ హీరోలందరూ మనకెందుకులే అని ఇంట్లో కూర్చోకుండా ఈసారి బయటకు వచ్చి వాళ్లే ప్యానల్ ని డిసైడ్ చేసి యూఏఎవరికి ఏ పదవో వాళ్లే నిర్ణయించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అల్లరి కాకుండా చూడాలి అని కళ్యాణ్ కోరారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''అందరం కలిసి ఓ బిల్డింగ్ కట్టుకోవాలి. సినీ కార్మికుల కోసం పది రోజుల్లో 11 కోట్లు కలెక్ట్ చేసిన మనం.. 'మా' బిల్డింగ్ కోసం 50 కోట్లు కలెక్ట్ చేయలేమా? నా స్థాయిని మించి నేను సాయం చేసేందుకు వస్తాను. నా మనవరాలి పేరు మీదున్న ఆస్తిని అమ్మి కోటిన్నర వరకు బిల్డింగ్ కోసం ఇస్తాను. తమిళ కన్నడ మలయాళ ఇండస్ట్రీలకు బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ మనకు ఇంత వరకు లేదు. ఈ విషయాలన్నీ మాట్లాడాంటే అందరి అప్పాయింట్ మెంట్ తీసుకొని వెళ్ళాలి. అందుకే మీడియా ద్వారా నా బాధను వారికి చేరవేస్తున్నాను'' అని కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.