Begin typing your search above and press return to search.

'ఇకపై రీమేక్ సినిమాలు చేయను'.. ‘మాస్ట్రో’ డైరెక్టర్ స్టేట్మెంట్..!

By:  Tupaki Desk   |   13 Sep 2021 10:31 AM GMT
ఇకపై రీమేక్ సినిమాలు చేయను.. ‘మాస్ట్రో’ డైరెక్టర్ స్టేట్మెంట్..!
X
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మేర్లపాక గాంధీ.. 'ఎక్స్ ప్రెస్ రాజా' 'కృష్ణార్జున యుద్ధం' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో రచయితగా 'ఏక్ మినీ కథ' చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ తో కలసి ''మాస్ట్రో'' సినిమాతో వస్తున్నాడు గాంధీ. రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై ఎన్‌.సుధాకర్‌రెడ్డి - నిఖితా రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. బ్లాక్ బస్టర్ 'అందాధున్' రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీలోవిడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ మేర్లపాక గాంధీ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు పంచుకున్నారు.

- అరకు దగ్గరలోని టైడా అనే ఊరిలో మొదటిసారి 'అందాధున్' సినిమా చూశా. చూడగానే మూవీలోని థ్రిల్లింగ్ మూమెంట్స్ నచ్చాయి. క్రైం, డార్క్ హ్యూమర్ బాగా నచ్చాయి. రీమేక్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలని అనిపించింది. నితిన్ గారు, సుధాకర్ రెడ్డి గారు అప్రోచ్ కావడంతో ఈ సినిమా చేసాం. ఒరిజినల్ వర్షన్‌ లోని లవ్ స్టోరీలో, క్లైమాక్స్‌లో కొన్ని మార్పులు చేసాం.

- బేసిక్‌ గా రీమేక్ సినిమా చేయడం కొంచెం కష్టం. ఉన్నది ఉన్నట్లుగా తీస్తే కాపీ పేస్ట్ అంటారు. ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. ఆ సమస్య అయితే ప్రధానంగా ఉంటుంది. అందుకే ఒరిజినల్ వర్షన్‌ లో ఆ ఫీల్ మిస్ కాకూడదని.. కొన్ని ఫ్రేమ్స్ ఉన్నవి ఉన్నట్లుగా చేశాం.

- 'మాస్ట్రో' చిత్రంలో అంధుడిగా నితిన్ బాగా చేశారు. కోవిడ్ సంబంధిత కొన్ని కారణాల వల్ల ప్రారంభంలోనే దుబాయ్ షెడ్యూల్ చేసి క్లైమాక్స్ షూట్ చేసాం. ఫస్ట్ షాట్‌ లోనే అంధుడిగా ఆ క్యారెక్టర్‌ లో లీనమై చేశారు నితిన్. దీంతో ఈ సినిమా చేసేయొచ్చనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. టబు చేసిన పాత్రలో తమన్నాను తీసుకోవాలనే ఆలోచన నాదే. టబు ఏజ్ గ్రూప్ కాకుండా కొద్దిగా యంగ్‌ గా వెళదామని ఇలా ప్లాన్ చేశాం. ఆమె కమర్షియల్ హీరోయిన్ కాబట్టి డిఫరెంట్‌ గా ఉంటుంది. తమన్నా యాక్ట్ చేస్తుంటే చూసి నేనే షాకయ్యా.

- డాక్టర్ క్యారెక్టర్ లో హర్ష బాగా చేశారు. సింగర్ మంగ్లీతో సీన్స్ బాగా వచ్చాయి. అలాగే రచ్చ రవి - సీనియర్ యాక్టర్ నరేష్ గారు - నభా నటేష్.. అందరూ చాలా బాగా నటించారు. మొదట ఈ సినిమాను జులై 11న రిలీజ్ ప్లాన్ చేసాం. కానీ సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో బాగా ఆలోచించి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ రూరల్ రీచ్ కాలేదు. చూడాలి మరి రీమేక్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది.

- మహతి స్వర సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాలుగు పాటలు చాలా కొత్తగా ట్రై చేశారు. సాంగ్ చిత్రీకరణ కోసం కొత్త అటెంప్ట్ చేసాం. బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్స్ పెట్టి వర్చువల్ రియాలిటీలో షూట్ చేశాం. 'మాస్ట్రో' అంటే మాస్టర్ ఆఫ్ మ్యూజిక్. చాలా టైటిల్ అనుకున్నాం కానీ చివరకు ఈ టైటిల్ ఫిక్స్ చేశాం. రీమేక్ సినిమాలు చేస్తుంటే కంపారిజన్స్ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా తర్వాత ఇక రీమేక్ సినిమాలు చేయను. ఈ సినిమా అవుట్‌ పుట్ చూసి నితిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్యూచర్‌ లో నితిన్‌ తో స్ట్రైయిట్ సినిమా కూడా చేస్తా.

- ఒక స్క్రిప్ట్ అనుకొని కొన్ని నెలలు ట్రావెల్ చేసి తర్వాత డ్రాప్ చేస్తుండటం వల్ల సినిమాలు రూపొందించడంలో కాస్త లేట్ అవుతోంది. నెక్స్ట్ ప్రాజెక్టు గురించి త్వరలోనే చెబుతా. మా నాన్న రొమాంటిక్ నావెల్స్ రాస్తుంటారు. నాకేమో అది నచ్చదు. మేమిద్దరం బాగా ఫైట్ చేసుకుంటాం. ఇంట్లో రైటర్స్ ఉంటే అదే ప్రాబ్లమ్. 42 రోజుల్లో ఈ 'మాస్ట్రో' సినిమా కంప్లీట్ చేసాం. రాయడమే లేటుగానీ, తీయడం ఫాస్ట్‌ గా తీస్తా. సోషల్ మీడియా బాగా ఫాలో అవుతూ ఏ ఫన్ అక్కడ వర్కవుట్ అవుతోందో పక్కాగా ప్లాన్ చేసుకుంటా.