Begin typing your search above and press return to search.
పూరి.. ఛార్మి పై కేస్ ఫైల్ చేస్తానంటున్న కమెడియన్
By: Tupaki Desk | 19 July 2019 6:30 AM GMTటాలీవుడ్ కమెడియన్ భద్రం తెలుసు కదా. రియల్ లైఫ్ లో అయన డాక్టర్.. కానీ రీల్ లైఫ్ కోసం యాక్టర్. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అనే సామెత ఈయనకు పూర్తిగా వర్తించదు. డాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యాడు. ఆ తర్వాత యాక్టర్ గా కూడా మారి.. డాక్టర్ గా యాక్టర్ గా రెండుపడవల ప్రయాణం చేస్తున్నాడు మన భద్రంగారు. ఈయన తాజాగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను చూశాడట. అందుకే చిత్ర దర్శకుడు పూరి.. నిర్మాత ఛార్మీలపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
భద్రం తన ట్విట్టర్ ఖాతా ద్వారా సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ "పూరి జగన్నాధ్ సర్.. ఛార్మీ మేడమ్ పై నేను కేసు ఫైల్ చేయబోతున్నాను. నేను రోజూ మెడిటేషన్ చేస్తాను. కానీ ఇస్మార్ట్ శంకర్ చిత్రం చూసిన తర్వాత ధ్యానం చేయలేకుండా ఉన్నాను.. అయితే కొన్ని మెడిటేషన్ క్లాసులు మిస్ అవడం కూడా మంచిదే. ఈ ఇస్మార్ట్ వీకెండ్ ను ఎంజాయ్ చెయ్యండి" అంటూ ట్వీట్ చేశాడు.
అయినా మన పిచ్చి కానీ డబల్ దిమాక్ సిమ్ కార్డ్ చూసిన తర్వాత ధ్యానం చేయడం ఎవరికైనా కుదురుతుందా? అసలే 'ఇస్మార్ట్ శంకర్' ది ఛోడ్ చింతా మార్ ముంతా ఫిలాసఫీ.. ఈ ధ్యానాలకు తపస్సులకు డెడ్ యాంటీగా ఉండే వ్యవహారం. ఆ ఇంపాక్ట్ లోనుంచి బైటకు రావాలంటే ఎలాంటివారికైనా కొంత సమయం కావాలి.