Begin typing your search above and press return to search.
'రెబల్ స్టార్ 'కి మరో రెబల్ ప్రపోజల్...
By: Tupaki Desk | 20 Feb 2019 6:15 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా? అని ఆయన ఫాన్స్ మాత్రమే కాదు, యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది. ఇక మరో పక్క ప్రభాస్ తనకు ఇష్టం అయిన అనుష్కని పెళ్లి చేసుకోనున్నాడు అని, అందుకే ఇంత లేట్ అని సైతం సోషియల్ మీడియా నుంచి సినిమా సర్కిల్స్ వరకూ ఒకటే డిస్కషన్. అయితే, అవన్నీ ట్రాష్ అని, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అనేది వారి వాదన. ఏది ఎలా ఉన్నా...అటు స్వీటి కూడా పెళ్లి చేసుకోకపోవడంతో, ఇటు ప్రభాస్ కూడా పెళ్లి పీటలకు దూరంగా ఉండి పోయాడు అని చిన్న గాసిప్ నడుస్తుంది.
ఇదిలా ఉంటే...తాజాగా ఒక తమిళ హీరోయిన్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది...నేను" ఐ లవ్ యూ" అంటూ చెప్పాలి అంటే అది ఒక్క ప్రభాస్ కి మాత్రమే చెప్తాను అని. దేవుడా! ఇంతకీ ఎవరు ఆ సుందరి? ఏమా కధ అంటే...'వరలక్ష్మీ శరత్‌కుమార్'! అందంతో, అభినయంతో తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ భామ, తన బ్యాక్ గ్రౌండ్ ను పెద్దగా పట్టించుకోకుండా, హీరోయిన్ పాత్రలు వస్తేనే చేస్తాను అని మొండి పట్టు పట్టుకుని కూర్చోకుండా హీరోయిన్ నుంచి విలన్ పాత్రల వరకూ వరుసగా వచ్చినవి వచ్చినట్లు చేసుకుంటూ పోతూ 'బోల్డ్ స్టార్ 'గా పేరు తెచ్చుకుంది. అయితే తెరపైనే కాదు, తాను తెర వెనుక కూడా, అంటే నిజ జీవితంలో కూడా బోల్డ్ అని చాలా సార్లు నిరూపించింది కూడా.
ఇక తాజాగా సర్కార్ లో ఆమె విలనిజం చూస్తే, ఔరా అనక మానరు..అంత బాగా నటించి, విమర్శకుల చేత సైతం ప్రశంసలు పొందింది. ఈ క్రమంలోనే ఈ భామ ఒకానొక ఇంటర్ వ్యూలో మాట్లాడుతూ లవ్ గురించి అడగగా...తాను లవ్ ప్రపోజ్ అంటూ చెయ్యాల్సి వస్తే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మాత్రమే చేస్తాను అని, ఎందుకంటే ప్రభాస్ అంటే తనకు అంత ఇష్టం అని ఆమె బోల్డ్ గా మాట్లాడింది. అయితే ఈ విషయం ప్రభాస్ వరకూ చేరిందో లేదో తెలీదు, ఒక వేళ చేరినా ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతాడో మరి..
ఏది ఏమైనా...అంత బోల్డ్ గా మాట్లాడడం చాలా తక్కువ మందికే సాధ్యం అవుతుంది..అందులో మన వరలక్ష్మీ శరత్ కుమార్ ముందు ఉంటుంది అని మరోసారి రుజువు అయ్యింది.