Begin typing your search above and press return to search.
కష్టపడతాను .. కామెంట్లు పట్టించుకోను: ప్రియమణి
By: Tupaki Desk | 2 Feb 2022 11:30 PM GMTతెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో కథానాయికగా ప్రియమణి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆమె చేసిన సినిమాల్లో 'పెళ్లైన కొత్తలో' .. 'యమదొంగ' మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత కాలంలో ప్రియమణికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె టీవీ షోస్ చేస్తూ వెళ్లారు. కాస్త గ్యాప్ తరువాత ఆమె మళ్లీ తెలుగులో పుంజుకుంటూ ఉండటం విశేషం. ఇటీవల వచ్చిన 'నారప్ప'లో ఆమెకి చెప్పుకోదగిన పాత్ర దక్కింది. ఆమె చేసిన 'విరాటపర్వం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆమె 'ఆహా' కోసం 'భామాకలాపం' చేసింది.
తాజా ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ .. "పెళ్లి అయిన తరువాత నేను కెరియర్ పరంగా ఇంకా బిజీ అయ్యాను. ఇప్పుడు నాకు చాలా కంఫర్టుబుల్ గా అనిపిస్తోంది. టీవీ షోలు .. వెబ్ సిరీస్ లు .. సినిమాలు వరుసగా చేస్తున్నాను. 2006 నుంచి 2012 వరకూ చాలా బిజీగా నా కెరియర్ కొనసాగింది. ఆ సమయంలో నేను పండుగ రోజుల్లో కూడా పనిచేస్తూ వెళ్లాను. ఉన్నది ఒక్కటే జీవితం .. లైఫ్ ను ఎంజాయ్ చేయాలి అనిపించింది. అందువలన వర్క్ ను తగ్గించుకుని .. ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ వెళుతున్నాను.
ఇంట్లో మీ అందరూ ఎలా ఉంటారో నేనూ అలాగే ఉంటాను. కెమెరా ముందు మాత్రమే నేను ఆర్టిస్టును .. ఇంట్లో మామూలు ప్రియమణినే. నాకు సంబంధించిన పనులను నేనే చేసుకుంటూ ఉంటాను. ఇక ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వలన ఈ రోజున నేను ఇక్కడ మాట్లాడుతున్నాను.
కెరియర్ పరంగా బిజీగా ఉన్నాను. ఒక మంచి ఫ్యామిలీ సపోర్టు లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ప్రియమణికి సినిమాలు తగ్గడం వల్లనే టీవీ షోస్ చేస్తుందనే విమర్శలు నా వరకూ రాలేదు. నేను చేస్తున్న టీవీ షోస్ కి మంచి రేటింగ్స్ వస్తున్నాయని ప్రోత్సహించారే తప్ప ఎవరూ కూడా నిరాశపరచలేదు.
ఇక కొంతమంది నెగెటివ్ గా కామెంట్స్ పెట్టొచ్చు .. కానీ నేను వాటిని గురించి పట్టించుకోను. ఎందుకంటే నేను అసలు యూ ట్యూబ్ చూడను. నా షోస్ కి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ లో చూడటం మిస్సయినప్పుడు యూ ట్యూబ్ చూస్తాను. చాలామంది కామెంట్స్ కోసం యూ ట్యూబ్ చూస్తుంటారు. నేను మాత్రం యూ ట్యూబ్ చూడను. ఎందుకంటే ప్రతి కామెంట్ కి రియాక్ట్ కాలేము కూడా. కాకపోతే ఒకమాట మాత్రం చెప్పగలను. నన్ను అభినందించేవారిని నేను ఎంతగా ప్రేమిస్తానో .. నెగెటివ్ కామెంట్స్ చేసేవారిని కూడా అంతే ప్రేమిస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.