Begin typing your search above and press return to search.
అందరు కోరుకునేదే విశాల్ కోరిక కూడా..!
By: Tupaki Desk | 27 Feb 2019 10:09 AM GMTతమిళనాడులో సినీ రంగ ప్రముఖులు రాజకీయాల్లో చక్రం తిప్పారు, తిప్పుతూనే ఉన్నారు. ఎంతో మంది స్టార్స్ తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో ప్రస్తుత తమిళ స్టార్ హీరోలు అయిన రజినీకాంత్ మరియు కమల్ హాసన్ లు కూడా రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. తమిళనాట ఇప్పటికే కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టాడు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం కూడా ఖాయమే అంటున్నారు. మరో వైపు రజినీకాంత్ మాత్రం పార్లమెంటు ఎన్నికలు వదిలేసి అసెంబ్లీ ఎన్నికల వరకు సిద్దం అవ్వాలని భావిస్తున్నాడు.
ఈ సమయంలోనే తమిళ జనాలు అంతా కూడా కమల్ హాసన్ మరియు రజినీకాంత్ లు కలిసి పోయి పని చేయాలని, ఇద్దరు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్, రజినీకాంత్ లు కలిస పని చేస్తే అద్బుతాలు ఆవిష్కారం అవుతాయని అంతా భావిస్తున్నారు. అలా జరగాలని అంతా కోరుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని యంగ్ తమిళ హీరో విశాల్ కూడా కోరుకుంటున్నట్లుగా ప్రకటించాడు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి పోటీ చేయాలని, వీరిద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే తిరుగుండదు అంటూ విశాల్ తన అభిప్రాయంను వ్యక్తం చేశాడు. రాష్ట్ర పరిస్థితితో పాటు మొత్తం మారిపోతుందని విశాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గతంలో విశాల్ కూడా రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించాడు. కాని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వారిద్దరు కలవాలని చెప్పిన విశాల్ తన విషయాన్ని మాత్రం చెప్పలేదంటే ప్రస్తుతానికి ఆయనకు క్రియాశీలక రాజకీయాలపై ఆసక్తి లేదని తేలిపోయింది.