Begin typing your search above and press return to search.
పెళ్లి చేసుకోను.. పిల్లల్ని కంటా.. ఈ మాట చెప్పింది 'సీత'
By: Tupaki Desk | 14 Sep 2022 5:30 PM GMTఅందం ఉండొచ్చు. అభినయం కూడా రావొచ్చు. అంత మాత్రానికే ఫేం వచ్చేస్తుందా? అంటే రాదంటే రాదు. ఎందుకంటే అందం.. అభినయం రెండూ ఉండగానే సరిపోదు.. అద్భుతమైన అవకాశం రావాల్సి ఉంటుంది. అందులో ఫ్రూవ్ చేసుకోవటానికి ప్రతిభతో పాటు కూసింత లక్ కూడా కలవాలి. అంతే.. పది సినిమాలు నటించినా రాని పేరు ప్రఖ్యాతులు ఒక్క సినిమాకు వచ్చేస్తాయి. తాజాగా అలాంటి అద్భుతమే జరిగి.. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ లా మారింది మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్.
చాలా మంది హీరోయిన్లు ఉన్నా.. సీతారామం మూవీలో సీత లాంటి క్యారెక్టర్ అందరికి రావటం చాలా చాలా అరుదు. అలాంటి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకొని తన అందంతో.. అభినయంతో ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఆమెకొచ్చిన ఇమేజ్ తో బోలెడన్ని ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఒక జాతీయ మీడియాతో ఆమె మాట్లాడింది. ఆ సందర్భంగా బోలెడన్ని విషయాల్ని చెప్పుకొచ్చింది.
అవన్నీఒక ఎత్తు. కానీ.. ప్రేమ.. పెళ్లి.. పిల్లలకు సంబంధించి ఆమె నుంచి ఏ మాత్రం ఊహించలేని మాటల్ని చెప్పుకొచ్చింది. ముప్ఫై ఏళ్ల వయసున్న మహిళలు డేటింగ్.. ప్రేమ.. పెళ్లి.. పిల్లల గురించి ఆసక్తిగా ఉండరన్న అంశంపై స్పందించిన ఆమె.. తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తన మనసును అర్థం చేసుకొని.. తన మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే వ్యక్తి తన జీవిత భాగస్వామిగా రావాలని తాను కోరకుంటున్నట్లు చెప్పింది.
అయితే.. అలాంటి వ్యక్తి దొరకటం చాలా అరుదుగా చెప్పిన ఆమె.. ఒకవేళ తాను కోరుకున్న అర్హతలు ఉన్న వ్యక్తి దొరకని పక్షంలో తాను పెళ్లి చేసుకోనని తేల్చేసింది. అంతేకాదు.. తనకు పెళ్లి మీద పెద్దగా ఆసక్తి లేదు కానీ.. పిల్లలు అంటే మాత్రంచాలా ఇష్టమని చెప్పింది. తనకు అమ్మ అని పిలిపించుకోవాలన్న ఆశ ఉందని.. ఒకవేళ పెళ్లి చేసుకోకున్నా.. తాను పిల్లల్ని కంటానంటూ షాకిచ్చే మాటను చెప్పింది.
అయితే.. తాను టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా అమ్మను అవుతానని చెప్పింది. తన పిండాన్ని భద్రపరిచి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా అమ్మను అవుతానన్న ఆమె.. ఈ విషయాన్ని తన తల్లికి చెబితే ఆమె కూడా ఒప్పుకుందని పేర్కొంది. మిగిలిన మాటలు ఎలా ఉన్నా.. పెళ్లి కాకున్నా పిల్లల్ని కనే విషయంలో రీల్ సీత చెప్పిన మాట అందరికి షాకిచ్చేలా ఉంటుందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.