Begin typing your search above and press return to search.
#RC 15: `ఒకే ఒక్కడు`ని కొట్టే రేంజులో ఉంటుందా?
By: Tupaki Desk | 15 July 2021 11:03 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా దీన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తామరతంపరగా ఎప్పటికప్పుడు లీకవుతోన్న ఒక్కో అప్ డేట్ అంతకంతకు అంచనాల్ని పెంచేస్తున్నాయి. `ఒకే ఒక్కడు`.. `భారతీయుడు`.. `అపరిచితుడు` రేంజ్ లో... శంకర్ మరో అద్భుతమైన స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని ప్రచారమవుతోంది.
సంఘంలో ఒక నిజాయితీగల ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయనాయకుడిగా టర్న్ అయితే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర పాయింట్ తో కథ సాగుతుందని తెలుస్తోంది. సామాజిక రాజకీయ అంశాల కోణంలో ఎమోషనల్ డ్రైవ్ తో కథ అంతా సాగుతుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో చరణ్ పాత్రకు సంబంధించి మరిన్ని లీకులు అభిమానుల్ని ఎగ్జయిట్ చేస్తున్నాయి.
కలెక్టర్ గా ఉన్న ఓ యువకుడు సీఎంగా బాధ్యతలు తీసుకుంటే వ్యవస్థ లో లోపాలను సరిచేసి సమర్థంగా ఎలా నడిపించగలడు? అనేది చరణ్ పాత్రలో హైలైట్ గా ఉంటుందని తనకు ఎదురయ్యే అడ్డంకుల్ని అతడు ఎలా అధిగమించాడన్నది రసవత్తరంగా ఉంటుందని తెలుస్తోంది. ఒకే ఒక్కడు తరహా కంటెంట్ దానికి భారతీయుడు సేనాపతి తరహా యాక్షన్ టింజ్ ని చూడొచ్చన్న గుసగుసా వేడెక్కించేస్తోంది.
నవతరం నటుల్లో ఈ పాత్రకు చరణ్ మాత్రమే నూరు శాతం న్యాయం చేయగలరని నమ్మి శంకర్ ఎంపిక చేసినట్లు సమాచారం. రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర శంకర్ ని ఎంతో ఆట్టుకుందిట. ఆ పాత్ర శంకర్ ని ఎంతగానో మెప్పించిందని... అందుకే చెర్రీని తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాకి మూల కథను కార్తీక్ సుబ్బరాజ్ అందిస్తున్నారని తెలిసింది.
ప్రస్తుతం శంకర్ నటీనటులు టెక్నీషియన్ల ఎంపికలో బిజీగా ఉన్నారు. హీరోయిన్ ఇతర కీలక పాత్రల నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.