Begin typing your search above and press return to search.

ఖాన్ వార‌సుడి లాంచింగ్ కి సౌత్ క‌థ‌లే కావాలి

By:  Tupaki Desk   |   30 May 2022 2:57 AM GMT
ఖాన్ వార‌సుడి లాంచింగ్ కి సౌత్ క‌థ‌లే కావాలి
X
ఖాన్ ల వార‌సుల లాంచింగుల‌కు కూడా ఒక సౌత్ రీమేక్ అవ‌స‌ర‌మైందా? దీన‌ర్థం సౌత్ హ‌వా అన్ని విభాగాల్లోనూ కొన‌సాగుతోంద‌నే! కేవ‌లం పాన్ ఇండియా రేస్ లోనే కాదు... ఇప్పుడు బాలీవుడ్ సౌత్ సినిమాపై ఎంత‌గా ఆధార‌ప‌డిందో అర్థం చేసుకోవ‌డానికి ఇంత‌కంటే ప్రూఫ్ అవ‌స‌రం లేదు. ఒక ర‌కంగా సౌత్ ట్యాలెంట్ క్రియేటివిటీ నార్త్ ట్యాలెంట్ క్రియేటివిటీని డామినేట్ చేస్తోందంటే అతిశ‌యోక్తి కాదు. నిజానికి వెయ్యి కోట్ల క్ల‌బ్ లే కాదు.. ప్ర‌తిదానికి సౌత్ వైపు చూడాల్సిన ఒక ర‌కమైన `ఆరా`(సౌర‌భం)ను సౌత్ ట్యాలెంట్ క్రియేట్ చేస్తోంది. దేనికైనా మ‌న‌వైపే చూడాలి వాళ్లు అన్నంత‌గా డామినేష‌న్ ని కంటిన్యూ చేస్తున్నార‌ని చెప్పాలి. సౌత్ నార్త్ అంటూ విడిగా చూడ‌లేమ‌ని చెబుతున్నా కానీ ఒక వైపు బాలీవుడ్ ప్ర‌ముఖులంతా మ‌రిగిపోతున్న స‌న్నివేశం క‌నిపిస్తోంది. మునుముందు బాలీవుడ్ పుంజుకోవ‌చ్చు. కానీ దీనికి సౌత్ ట్యాలెంట్ మాత్ర‌మే స్ఫూర్తిగా నిలుస్తుంది.

ఇప్పుడు ఖాన్ ల కాంపౌండ్ నుంచి ఒక న‌ట‌వార‌సుడిని లాంచ్ చేసేందుకు సౌత్ రీమేక్ పై ఆధార‌ప‌డ‌డం ఆస‌క్తిగా మారింది. అదే స‌మ‌యంలో గ‌ల్లీ బోయ్స్ ఫేం జోయా న‌లుగురు న‌ట‌వార‌సుల‌ను బాలీవుడ్ కి ప‌రిచ‌యం చేస్తూ ఒక ఫారిన్ రీమేక్ తో త‌ప్పు చేస్తోంద‌న్ వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అస‌లు భార‌తీయ‌త అనేది లేని పాత్ర‌ల‌ను క్రియేట్ చేస్తోందంటూ జోయాపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నెటిజ‌నుల నుంచి అవ‌హేళ‌న‌లు అప‌వాదులు వ‌చ్చి ప‌డుతున్నాయి.

కరణ్ జోహార్ -ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వార‌సుడు ఇబ్రహీం అలీ ఖాన్ ను లాంచ్ చేసేందుకు స‌న్నాహ‌కాల‌లో ఉన్నారు. దీనికోసం ఒక సౌత్ క‌థ‌ను ఎంచుకున్నారు. లెజెండరీ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన 2021 మలయాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `హృదయం` చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. కరణ్ జోహార్ ఫాక్స్-స్టార్ స్టూడియోస్ హిందీ రీమేక్ హ‌క్కుల‌ను ఛేజిక్కించుకున్నాయి.

ఇది ఇబ్రహీం కోసం ఎంపిక చేసుకున్న ఉత్తమ డెబ్యూ క‌థాంశం. గత కొంత కాలంగా ఇబ్రహీంకు తగిన లాంచ్ ఫిల్మ్ కోసం కరణ్ వెతుకుతున్నాడు. హృదయంలోని ఒక ధైర్యమైన విద్యార్థి వివాహం .. తండ్రిగా పరిణతి చెందిన పాత్ర ఇబ్రహీంకు సరిగ్గా సరిపోతుందని క‌ర‌ణ్ భావించార‌ట‌. అందుకే ఈ క‌థ‌ను ఎంపిక చేసుకున్నారు. నిజానికి కరణ్ ఇబ్రహీం సోదరి సారా అలీ ఖాన్ ను కూడా లాంచ్ చేయాల్సి ఉంది. కానీ ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వ‌డంతో కేదార్‌నాథ్ లో న‌టించింది. ఆ చిత్రానికి అభిషేక్ కపూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈసారి కరణ్ ఛాన్స్ వ‌ద‌ల్లేదు. ఖాన్ వారసుడి కోసం సాధ్యమైనంత ఉత్తమమైన ప్రయోగాన్ని ఎంపిక చేసుకున్నాడ‌న్న చ‌ర్చ సాగుతోంది. అయితే క‌ర‌ణ్ జోహార్ స‌హా ప‌లువురు బాలీవుడ్ దిగ్గ‌జాలు సౌత్ క‌థ‌ల‌పై ఆధార‌ప‌డ‌డం అంత‌కుమించి చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఖాన్ ల వార‌సుల కోసం నార్త్ క్రియేటివిటీని కాకుండా సౌత్ క్రియేటివిటీని అనుస‌రించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఖాన్ లు సౌత్ ప్ర‌తిభ‌ను గుర్తించ‌రు... గౌర‌వించ‌రు.. కానీ వారి ఎదుగుద‌ల‌కు మాత్రం సౌత్ ప్ర‌తిభ కావాలి!! ప్చ్!!