Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా 'బ్రాండ్ అంబాసిడర్' గా ఐకాన్ స్టార్..!
By: Tupaki Desk | 17 July 2022 6:30 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతేకాదు ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించి.. సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. సౌత్ స్వాగ్ ఏంటో నార్త్ కు తెలియజెప్పిన బన్నీ.. తన బ్రాండింగ్ వాల్యూ పెంచుకుంటూ వెళ్తున్నారు.
సౌత్ ఇండియాలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ఇప్పటికే పలు బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు సినిమాలు మరోవైపు కమర్షియల్స్ తో హవా చూపిస్తూ వచ్చాడు. అయితే 'పుష్ప' సినిమా తర్వాత బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్ళిపోయింది. దీంతో ప్రముఖ కంపెనీలన్నీ ఇప్పుడు స్టైలిష్ స్టార్ వెంటపడుతున్నాయి.
తాజాగా అగ్రశ్రేణి శీతల పానీయం కంపెనీ 'కోక్' తమ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ని నియమించుకున్నట్లు తెలుస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ కు బన్నీ ప్రచారకర్తగా వ్యవహరించడం విశేషం. ఇప్పటికే ఐకాన్ స్టార్ అగ్రిమెంట్ లో భాగంగా ఓ యాడ్ షూట్ కూడా చేస్తున్నారు.
ఈ కూల్ డ్రింక్ కంపనీకి సంబంధించిన యాడ్ షూటింగ్ కోసం అల్లు అర్జున్ ప్రస్తుతం థాయ్ లాండ్ లో ఉన్నారు. ఈ కమర్షియల్ ప్రకటనకు టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. యాడ్ షూట్ పూర్తి చేసి ఈ నెల 19న వీరు ఇండియాకి తిరిగి రానున్నారని చెబుతున్నారు.
అదే సమయంలో ధర్మా ప్రొడక్షన్ 2.0 నిర్మాణంలో అల్లు అర్జున్ ఈ యాడ్ చేస్తున్నారని.. కొల్లిన్ అనే యాడ్ ఫిలిం మేకర్స్ ఈ ప్రకటనకు దర్శకత్వం వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. బన్నీ డ్యాన్స్ చేస్తున్న కొన్ని ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
కోక్ స్టూడియోస్ అనేది అల్లు అర్జున్ చేతికొచ్చిన మొదటి పెద్ద బ్రాండ్ ఎండార్స్మెంట్ అని చెప్పాలి. గతంలో ఈ శీతల పానీయాల కంపనీకి అనేకమంది సౌత్ స్టార్స్ అంబాసిడర్స్ గా చేశారు కానీ.. ఇండియా వైడ్ ప్రచారకర్తగా ఎవరూ వ్యవహరించలేదు.
ఏదైతేనేం 'పుష్ప' తో విస్తృత ఖ్యాతి గడించిన బన్నీ.. ఇప్పుడు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ లోనూ దూసుకుపోతున్నారు. ఇకపోతే లేటెస్టుగా ఇండియా టుడే మ్యాగజైన్ తన కవర్ పేజీ మీద అల్లు అర్జున్ ముఖ చిత్రాన్ని ప్రచురించింది. 'ది సౌత్ స్వాగ్' అంటూ కేవలం ఒక్క పాన్ ఇండియా చిత్రంతో అతను సృష్టించిన క్రాస్ ఓవర్ వాల్యూ గురించి పేర్కొంది.
అల్లు అర్జున్ త్వరలోనే ‘పుష్ప ది రూల్’ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందించనున్నారు.
'పుష్ప' పార్ట్-1 కు వచ్చిన అనూహ్య స్పందన మరియు రెండో భాగంపై నేషనల్ వైడ్ ఏర్పడిన అంచనాలను దృష్టిలో పెట్టుకొని.. 'పుష్ప 2' చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.